Oppo Reno 15 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ అవుతుంటాయి. అయితే, తాజాగా మరో ఆసక్తికర లాంచ్‌కు సిద్ధమవుతోంది ఒప్పో. కంపెనీ తమ కొత్త ఒప్పో రెనో 15 సిరీస్ Reno 15 సిరీస్‌ను అధికారికంగా నవంబర్ 17న చైనాలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు మన ముందుకు రాబోతున్నాయి. రెనో 15 ( Reno 15), రెనో 15 ప్రో ( Reno 15 Pro), అలాగే కొత్త రెనో 15 మినీ ( Reno 15 Mini ) ఉండనున్నాయి. లాంచ్ ఈవెంట్ చైనా సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత సమయం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభం కానుంది. మూడు మోడళ్లు లైన్‌అప్‌లో ఉన్నాయి. ఒప్పో ఇప్పటికే Reno 15, Reno 15 Pro మోడళ్లను తమ అధికారిక ఈ-షాప్‌లో లిస్ట్ చేసింది. వీటి ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కలర్ ఆప్షన్స్ & స్టోరేజ్ వేరియంట్లు
Oppo Reno 15 స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ మోడల్‌ను కంపెనీ మూడు వేర్వేరు రంగుల్లో విడుదల చేయబోతోంది. స్టార్లైట్ బో (Starlight Bow), ఆరోరా బ్లూ (Aurora Blue), కనెల్ బ్రౌన్ (Canele Brown). ప్రతి షేడ్ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను ఇస్తుంది. స్టోరేజ్ విషయంలో కూడా ఒప్పో విభిన్న వేరియంట్లను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఐదు కాన్ఫిగరేషన్లు అందుబాటులో ఉంచుతుంది.
Oppo Reno 15
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 256GB స్టోరేజ్
16GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 1TB స్టోరేజ్
Oppo Reno 15 Pro
Oppo Reno 15 Pro మోడల్ స్టార్‌లైట్ బో( Starlight Bow) , అరోరా బ్లూ (Aurora Blue), హానీ గోల్డ్ ( Honey Gold) కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 512GB స్టోరేజ్
16GB RAM + 1TB స్టోరేజ్
(Display) డిస్ప్లే వివరాలు ఎలా ఉన్నాయంటే?
లీక్ అయిన సమాచారం ప్రకారం, Reno 15 Pro 6.78 ఇంచుల 1.5K ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది.
Reno 15 Mini 6.32 ఇంచుల 1.5K స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.
అయితే, స్టాండర్డ్ Reno 15 6.59 ఇంచుల డిస్ప్లేతో ఉంటుంది.
కెమెరా ఫీచర్లు
Reno 15 Pro, Reno 15 Mini మోడళ్లలో త్రిపుల్ రియర్ కెమెరా సెట్‌అప్ ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రధానంగా
200MP Samsung ISOCELL HP5 ప్రైమరీ సెన్సార్,
50MP అల్ట్రా-వైడ్ లెన్స్,
50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి.
ముందు భాగంలో, అన్ని మోడళ్లలోనూ 50MP సెల్ఫీ కెమెరా లభించనుంది.
లాంచ్ వివరాలు
Oppo Reno 15 సిరీస్ అధికారిక లాంచ్ ఈవెంట్ నవంబర్ 17న జరుగుతుంది. చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజున అధికారికంగా వెల్లడిస్తారు.
