Maruti Suzuki: భారత ఆటో రంగంలో రికార్డు సృష్టించిన మారుతి సృష్టించింది. కాదు, రాకెట్ వేగంతో దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. కంపెనీ దేశీయ మార్కెట్‌లో 3 కోట్ల కార్ల విక్రయాల మైలురాయిని దాటింది. ఈ రికార్డును కేవలం 42 ఏళ్ల వ్యవధిలో సాధించింది.
మారుతి తెలిపిన వివరాల ప్రకారం, మొదటి కోటి కార్ల విక్రయాలు 28 సంవత్సరాలు 2 నెలల్లో పూర్తవగా, తర్వాత కోటి విక్రయాలు కేవలం 7 సంవత్సరాలు 5 నెలల్లోనే సాధించింది. ఇక ఇప్పుడు తాజాగా మరో కోటి విక్రయాలు కేవలం 6 సంవత్సరాలు 4 నెలల్లోనే పూర్తిచేయడం కంపెనీకి మరో అద్భుత ఘనతగా నిలిచింది.
కంపెనీ ప్రకారం, ఇప్పటివరకు భారత్‌లో అమ్మిన 3 కోట్ల కార్లలో ఆల్టో Alto మోడల్ అత్యధిక ప్రజాదరణ పొందింది. 47 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దాని తర్వాత Wagon R 34 లక్షల యూనిట్లతో, Swift 32 లక్షల యూనిట్లతో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే బ్రెజ్జా , Brezza , ఫ్రాంక్స్ Fronx మోడళ్లు కూడా టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో చోటు దక్కించుకున్నాయి.
మారుతి సుజుకి ప్రయాణం 1983 డిసెంబర్ 14న మొదలైంది. ఆ రోజు కంపెనీ తొలి కారు Maruti 800 తొలి కస్టమర్‌కి అందించబడింది. అప్పటి నుండి ఇప్పటివరకు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్యాసింజర్ వాహనాలను తయారు చేస్తూ, “Joy of Mobility” అనే తమ కలను నిజం చేసుకునే దిశగా కంపెనీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మారుతి సుజుకి 19 మోడళ్లలో 170కి పైగా వేరియంట్లు అందిస్తోంది.
ఈ ఘనతను సాధించిన సందర్భంగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ హిసాషి టకేయూచీ మాట్లాడుతూ, “ భారతదేశ వ్యాప్తంగా 3 కోట్ల మంది తమ మొబిలిటీ కలను నెరవేర్చుకోవడానికి మారుతి సుజుకిపై నమ్మకం ఉంచినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కానీ, ప్రతి 1,000 మందికి కేవలం 33 కార్లు ఉన్న దేశంలో మన ప్రయాణం ఇక్కడితో ఆగదు,” అని తెలిపారు. అలాగే, “భవిష్యత్తులో మరింత మంది ప్రజలకు మొబిలిటీ ఆనందాన్ని అందించేందుకు, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మద్దతు ఇస్తూ మేము నిరంతరం కృషి చేస్తాము,” అని ఆయన తెలిపారు.
