Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: హైడ్రా కు జేజేలు కొడుతున్న జనం.. భావితరాలకు బాసటగా నినాదాలు

Hydraa: మా చెరువును కాపాడారంటూ కొన్ని కాల‌నీల‌ ప్ర‌జ‌లు, మాకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించార‌ని మ‌రి కొన్ని కాల‌నీల నివాసితులు హైడ్రా(Hydraa)కు సైతం అభినంద‌న‌లు తెలిపి, అండగా నిలిచారు. గడిచిన మూడు రోజులుగా గ్రేటర్ లోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు హైడ్రా చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని బాసటగా నిల్వటంతో పాటు హైడ్రాకు అండగా మేమున్నామంటూ నిలబడుతున్నారు. భావి త‌రాల‌కు బాట‌లు వేస్తున్న హైడ్రాకు మద్దతును ప్రకటిస్తున్నారు. హైడ్రా వ‌చ్చింది మా క‌ష్టాలు తీర్చిందంటూ ప‌లువురు సంతృప్తి వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద క‌ష్టాల‌ను తాము నేరుగా చూశామని, హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన తీరును కూడా గ‌మ‌నించామని, ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు ఇంత త్వ‌ర‌గా ప‌రిష్కారం దొరుకుతుంద‌ని తాము ఊహించ‌లేదంటూ ప‌లువురు హైడ్రాకు అభినంద‌న‌లు తెలిపారు.

వ‌ర‌ద కాలువ‌కు అనుసంధానం

ర్యాలీలు నిర్వహించి హైడ్రాకు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. బాగ్‌లింగంప‌ల్లి శ్రీ‌రాంన‌గ‌ర్ బ‌స్తీ క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. 5 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డితే ఈ బ‌స్తీని వ‌ర‌ద ముంచెత్తుతుంది. న‌డుం లోతు నీటిలో ఇళ్ల‌కు చేుతుండటంతో హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే వ‌చ్చి హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌ధాన వ‌ర‌ద కాలువ‌కు అనుసంధానం చేయ‌డంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. ఇక్క‌డ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి వ‌ర‌ద‌ కాలువ‌ను ఆక్ర‌మించి మల్లించ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య త‌లెత్తిన వెంట‌నే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలంటూ ర్యాలీ నిర్వ‌హించి మ‌ద్ద‌తు ప‌లికారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవ‌ర‌యాంజ‌ల్ విలేజ్‌లోని తుర‌క‌వాణికుంట నుంచి దేవ‌ర‌యాంజ‌ల్ చెరువుకు వెళ్లే వ‌ర‌ద కాలువ 6 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంటుంది. అక్క‌డ కొంత‌మంది ఆ నాలాను కేవ‌లం 2 ఫీట్ల పైపులైను వేసి మిగ‌తా భూమిని క‌బ్జా చేయ‌డంతో త‌మ ప్రాంతాల‌న్నీ నీట మునుగుతున్నాయ‌ని హైడ్రాకు ఫిర్యాదు చేయగా, కేవలం నెల రోజుల్లో హైడ్రా సమస్యను పరిష్కరించిందని గుర్తు చేసుకున్నారు.

Also Read: Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు

ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రా(Hydraa)కు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఉద‌యం ర్యాలీలు నిర్వ‌హించి హైడ్రాకు మ‌ద్ద‌తు తెలిపారు. అభివృద్ధి పేరిట చెరువు ముష్కిన్ చెరువు ఎఫ్ టీఎల్(FTL) పరిధిలో మట్టి పోసి బండ్ నిర్మాణం చేపట్టడంతో సరస్సు సహజ ప్రవాహం ఆగిపోగా, చెరువు నీరు కాలుష్యానికి గురైంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కిన్ చెరువు మత్స్యకారుల జీవనాధారంగా ఉండేదని స్థానికులు వెల్లడించారు. వారు తరతరాలుగా ఇక్కడ చేపల వేట చేసేవారని పేర్కొన్నారు. ఆ కాలంలో వారి కుటుంబాలు కూడా ఈ సరస్సు నీటినే తాగేవారని తెలిపదారు. కానీ ఇటీవల కాలంలో సరస్సు కాలుష్యానికి గురై జీవవైవిధ్యం కోల్పోయిందని ఫిర్యాదుతో చేసిన వెంటనే హైడ్రా అధికారులు స్పందించి, ఎఫ్ టీఎల్ పరిధిలో పోసిన మట్టిని పూర్తిగా తొలగించారు. చెరువు సహజ పరిమాణం పునరుద్ధరించడంతో సరస్సు పూర్వ వైభాన్ని సంతరించుకుంది. చెరువును కాపాడిన హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లంటూ మత్స్యకారులు, స్థానికులు హైడ్రా చర్యలను అభినందించారు.

Also Read: Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..

Just In

01

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

Bandi Sanjay: గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేత.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Wine Shops Closed: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌‌లో మూడు రోజులు వైన్స్ బంద్..?

Businessman Re Release: పోయించడానికి మళ్లీ సారొస్తున్నారు!