Medak District (imagecredit:swetcha)
మెదక్

Medak District: పౌష్టికాహారం రాజకీయ పథకం కాదు.. రాజ్యాంగ హక్కు: శ్రీనివాస్ రెడ్డి

Medak District: నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy), సభ్యులు ఓరగంటి ఆనంద్, మూలుకుంట్ల భారతి, రంగినేని శారద గార్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. నర్సాపూర్ చేరుకున్న కమిషన్ చైర్మన్, సభ్యులకు జిల్లా అదునపూ కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. నర్సాపూర్ పట్టణంలోని రేషన్ షాప్ నెంబర్ 1741014 ను, MLS పాయింట్ ను, రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని, కౌడిపల్లి మండలం లోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj), అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

రాతపూర్వక ఫిర్యాదులు..

ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పౌష్టికాహారం అనేది ఏ ప్రభుత్వ పథకం కాదని, ఇది రాజ్యాంగమైన హక్కు అన్నారు. రేషన్ షాపుల్లో ఫిర్యాదుల బాక్స్లలను, ఫిర్యాదులు స్వీకరించే అధికారుల పేరు హోదా ఫోన్ నెంబర్లను నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంతోధ్యాయ కార్డు కలిగిన వారికి చక్కెర ఇవ్వడం లేదని, తూకంలో తేడాలు ఉన్నాయని, ఎంఎల్ఎస్ పాయింట్లో సిబ్బంది సరిగా ప్రవర్తిస్తలేరనే రాతపూర్వక ఫిర్యాదులు అందాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి ఇచ్చే గుడ్డు సైజు చాలా చిన్నగా ఉందని, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను అధికారుల పర్యటన వచ్చినప్పుడు మాత్రమే చూపించకుండా, అంగన్వాడి సమయాల్లో పిల్లలకు ఆట వస్తువులు ఇవ్వడం ద్వారా మానసిక పరిపక్వత వస్తుందన్నారు. రెడ్డిపల్లి హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేదని, మధ్యాహ్న భోజనం పంపిస్తున్న నిర్వాహకులకు అధికారులు నోటీసులు ఇచ్చి, రాతపూర్వక సమాధానం ఇవ్వాలన్నారు. అక్షయపాత్ర నుండి వచ్చే మధ్యాహ్న భోజనం పాఠశాలకు వచ్చేసరికి చల్లారిపోయి, గడ్డలు గా మారిపోతుండడంతో పిల్లలు ఎవరు తినడం లేదనీ దీనిపై అక్షయపాత్ర సంస్థ సమాధానం చెప్పాలన్నారు.

Also Read: Visakhapatnam: విశాఖలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు.. ఇళ్ల నుంచి పరుగో పరుగు!

తల్లిదండ్రుల కమిటీలు కూడా..

ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించడం లేదని, నాన్ వెజ్ పిల్లలకు అందడం లేదని దాన్ని సరిచూసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న దాదాపు లక్ష మంది విద్యార్థులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి రిపోర్ట్ అందించాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో మరింత ముందుకెళ్లాలని తెలిపారు. ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ మాట్లాడుతూ ఆహారం ఒక హక్కుగా రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రతి పాఠశాల ,అంగన్వాడీలలో తల్లిదండ్రులతో సమావేశ ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రుల కమిటీలు కూడా వేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వంటగదిని పూర్తిగా శుభ్రపరిచి దుమ్ము ధూళి లేకుండా పరీక్షించి మధ్యాహ్న భోజనం వండాలని అధికారులకు సూచించారు. గర్భిణీ స్త్రీలకు, ప్రసూతి స్త్రీలకు ప్రభుత్వ నుంచి వచ్చే ఆహార పదార్థాలు అందించాలన్నారు. వారికి నగదు రూపంలో వచ్చే ఆరువేల రూపాయలు పథకాన్ని అమలు చేసి పేదవారికి సహాయం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు చేసిన ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి, అధికారుల సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డిఈఓ రాధకిషన్, బిడబ్ల్యుఓ హేమ భార్గవి, సివిల్ సప్లై అధికారి నిత్యానంద, నర్సాపూర్ ఆర్డిఓ మైపాల్ రెడ్డి, డిఆర్డిఏపిడి శ్రీనివాసరావు, తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చర్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చైర్మన్ సభ్యులు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కేథడ్రల్ చర్చ్(Medak Cathedral Church) ఏడుపాయల దుర్గామాత ఆలయంలో చైర్మన్, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Also Read: Weather Update: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..