Kishan Reddy (imagecredit:twitter)
Politics, హైదరాబాద్

Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము కింగ్ మేకర్లం కాబోమని, గెలిచి కింగ్ అవుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(janasena) కార్యకర్తలు సానుభూతితో పనిచేస్తున్నారని తెలిపారు. అలా అని వారితో తాము జత కట్టుకుని తిరగడం లేదని పేర్కొన్నారు. ఈ బైపోల్ లో త్రిముఖ పోరు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలపై వచ్చిన సర్వేలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేలు బెడ్రూంలో ఉండి చేశారో.. ఎక్కడ ఉండి చేశారో అనేది ఎవరికీ తెలియదని చురకలంటించారు. తాము గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కూడా సర్వే చేయలేదని, ఈ బైపోల్ కు కూడా చేయబోమన్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు. సన్నబియ్యంలో కేంద్రం ఇచ్చేవి రూ.42 ఉన్నాయని, రాష్ట్రం రూ.13 మాత్రమే ఇస్తుందన్నారు. సీఎం తనను కోసినా రూపాయి లేదన్నారని, చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని చెబుతున్నారని, అలాంటప్పుడు మామీలు ఎందుకు ఇచ్చినట్లని ప్రశ్నించారు.

ముస్లింలపై ప్రేమతో మంత్రి..

తాము తమ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదని, దేశంలో జరిగే 7 ఉప ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థిని ప్రకటించామన్నారు. రేవంత్ కోసమో ఇంకెవరి కోసమో ముందే ప్రకటించలేమని ఎద్దేవాచేశారు. అజారుద్దీన్(Azharuddin) వల్ల ఓట్లు వస్తాయని భావిస్తే టికెట్ ఆయనకే ఇచ్చేవారు కదా అని వ్యాఖ్యానించారు. ముస్లింలపై ప్రేమతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని, కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇచ్చారని చెప్పారు. ఆయనపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం తమకు ప్లస్ అవుతుందని పేర్కొన్నారు. మెట్రో ఫేస్ 2 కు సంబంధించిన డీపీఆర్(DPR) ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు. ఎల్ అండ్ టీ.. తమకు నష్టం వస్తోందని, మెట్రో నడపబోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారని, దీనికి సంబంధించిన మార్పు ప్రక్రియ ఇంకా జరగలేదన్నారు. అనవసరంగా కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా? అని ఫైరయ్యారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమంటే విజిలెన్స్ పేరిట బెదిరిస్తున్నారని, ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల నష్టపోయేది యాజమాన్యాలు కాదని, విద్యార్థులు నష్టపోతారని గుర్తుంచుకోవాలన్నారు. యాజమాన్యాలను భయపెడితే భయపడే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదని అనిపిస్తే సర్కార్ రెండేళ్లు ఏం చేసిందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తప్పులుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ఫైరయ్యారు. నిబంధనలు పాటించని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలని సూచించారు. అంతేకాని రీయింబర్స్ మెంట్ అడిగితే విజిలెన్స్ దాడుల పేరిట భయపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read: Kalvakuntla Kavitha: జూబ్లీలో ఎవరు గెలిచినా ఒరిగేదేం లేదు.. పత్తి రైతుల్ని ఆదుకోండి.. సీఎంకు కవిత చురకలు

ఎవరికీ తెలియదని కిషన్ రెడ్డి..

బీఆర్ఎస్(BRS) అధికారం కోల్పోయాక కేసీఆర్ ఎక్కడా ప్రజల్లో కనిపించడం లేదని, తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని దీన్నిబట్టి అర్థం చేసుకోవాలన్నారు. కానీ కేటీఆర్(KTR) మాత్రం మళ్ళీ తమదే అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 8 సీట్లు వచ్చాయని, పార్లమెంట్ లో కూడా 8 సీట్లు వచ్చాయన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలవ్వాలంటే 9వ షెడ్యూల్ లో చేర్చాలని, కాంగ్రెస్(Congress) ఎన్నో ఏళ్ళు పాలించిందని, మరి అప్పుడు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దేశమంతా జనగణన చేశాక దాని ఆధారంగా తాము రిజర్వేషన్లు అమలుచేస్తాన్నారు. కాంగ్రెస్ చెప్పిన 42 శాతంలో 10 శాతం ముస్లింలకు ఇస్తున్నారని, తద్వారా 42 శాతంలో కూడా ముస్లింలు పోటీ చేస్తున్నారని, దీన్ని ఆపే దమ్ము సీఎంకు ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ అంశం కోర్టులో ఉందని, సీబీఐ(CBI)కి ఒక మేడిగడ్డపైనే విచారణకు ఇస్తే ఎలా? అని మొత్తం ప్రాజెక్టుపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) కు మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టే కేసులపై ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్నారు.

పూర్తిగా డిజిటల్ రూపంలో..

దేశవ్యాప్తంగా జనగణన 1 ఏప్రిల్ 2026 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు దశల్లో ఈ ప్రక్రియ జరగనుందన్నారు. హౌజ్ లిస్ట్, హౌజ్ షెడ్యూల్, జనాభా లెక్కలు, కులాల వారీగా గణన, వ్యక్తిగత సమాచారం ద్వారా సెన్సస్ జరగనుందని కేంద్ర మంత్రి వివరించారు. లక్షల మంది స్టాఫ్ ఇందులో భాగమవుతారని, పూర్తిగా డిజిటల్ రూపంలో డేటాను అందిస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తన లోక్ సభ పరిధిలో జరిగే ఎన్నిక కాబట్టి తాను పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమితో పొత్తు ఉంటుందో లేదో అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేమన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తులు, పదవుల కొట్లాట జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ కుటుంబంలో ముసలం నెలకొందని, అందుకే కవిత బయటకు వచ్చిందన్నారు. ఆమెకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అది పూర్తిగా డాడీ, డాటర్ ఇష్యూ అని, వారు వారు తేల్చుకోవాలన్నారు. కవిత ఎవరిని తిట్టాలని ఎవరిని తిడుతుందో తనకే తెలియాలన్నారు. వారి గురించి కామెంట్స్ చేసి కూడా వేస్ట్ అని పేర్కొన్నారు.

హీరోలను జైల్లో పెట్టారా..

పార్టీ ఫిరాయింపుల చట్టానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ తూట్లు పొడిచాయని విమర్శించారు. అందుకే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే రాజాసింగ్ విషయంపై తాను కామెంట్స్ చేయదలుచుకోలేదని చెప్పారు. సినీ కార్మికులతో సీఎం మీటింగ్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు. వారి స్థలం, ఇండ్లు లాక్కున్నారని, కొందరివి కూల్చారని వ్యాఖ్యానించారు. హీరోలను జైల్లో పెట్టారన్నారు. సినీ ఇండస్ట్రీలో అందరినీ తాము కలుస్తున్నామని, రేవంత్ అభిమానులు ఆయనకు, తమ అభిమానులు బీజేపీకి ఓట్లేస్తారన్నారు. ఇకపోతే చిరంజీవి.. ప్రధాని మోడీకి అభిమాని అని, కానీ ఈ ఉప ఎన్నికలపై ఆయనతో మాట్లాడలేదన్నారు. బీహార్ ఎలక్షన్ లో వందకు వంద శాతం గెలుస్తామని ఆయన ధీమాతో ఉన్నారు. తెలంగాణలో ఎంఐఎం 7 అసెంబ్లీ సీట్లకు మించి 8వ సీటుకు పోటీ చేయబోదని, అలాగే 1 ఎంపీ స్థానానికి మించి పోటీ చేయబోదన్నారు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఈ రాష్ట్రంలో తప్పా దేశమంతా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికుల మరణం తీవ్రంగా కలచివేసినట్లు కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Also Read: Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..