Vikarabad Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరువకముందే తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక ఆర్టీసీని ఓ లారీ వచ్చి బలంగా ఢీకొట్టింది. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి తాండూరు వైపు బస్సు వస్తుండగా కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
మరో బస్సు ప్రమాదం..!
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్ వద్ద ఘటన
లారీని ఢీకొట్టిన కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ బస్సు
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు pic.twitter.com/uzTSJMCiY4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 4, 2025
సోమవారం ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు.. చేవెళ్ల మండలంలో ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ డ్రైవర్.. బస్సును బలంగా ఢీకొట్టాడు. దీంతో టిప్పర్ లోని కంకర మెుత్తం బస్సుపైన పడిపోయింది. కంకర కింద చిక్కుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 19 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Minister Azharuddin: ఉత్కంఠకు చెక్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు
ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. సుమోటోగా కేసు నమోదు చేసింది. అంతేకాకుండా చేవెళ్ల – తాండూరు మధ్య ప్రాంతాన్ని డెత్ కారిడార్ గా హెచ్ఆర్‌సీ అభివర్ణించింది. రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, డివైడర్లు లేకపోవడం, అతి వేగం, ఓవర్ లోడింగ్, హైవే విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా అనేక ప్రాణాంతక ప్రమాదాలు.. ఆ మార్గంలో చోటుచేసుకున్నాయని పేర్కొంది. నిబంధనల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా హెచ్ఆర్‌సీ మండిపడింది. ఘటనపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
