Jubilee-Hilss-bypolls (Image source Swetcha))
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

TPCC: మహిళా ఓటర్లపై ఫోకస్

ఒక్కో టీమ్‌లో 9 మంది ముఖ్య నేతలు
రెండు లక్షల ఓటర్లను ప్రభావితం చేసేలా ప్లాన్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు 7 ప్రత్యేక మహిళా బృందాలను టీపీసీసీ (TPCC) నియమించింది. ఈ టీమ్‌లన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలా పనిచేయనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ వారం రోజుల పాటు ఆయా ఓటర్ల ఇంటికి నేరుగా ఈ టీమ్స్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని అభ్యర్ధించనున్నాయి. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నారు.

ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ టీమ్‌లో మంత్రి కొండా సురేఖ, టీ నిర్మల గౌడ్, పుష్పలీల, అడవుల జ్యోతి, భవాని, ఇందిరారావు, రవళి రెడ్డి, షమీమ్ అఘా, రిజ్వానా బేగం లు ఉండగా, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి టీమ్ లో డాక్టర్ మట్టా రాగమయి, సరితా తిరుపతయ్య, సింగపురం ఇందిరా, శోభారాణి, ఇందుప్రియా రెడ్డి, గిరిజాశేట్కార్, దివ్యవాణి చౌదరి, నసీమ్ సుల్తానా, ఖనీస్ పాతీమా లు క్యాంపెయిన్ చేయనున్నారు. ఇక విజయ శాంతి టీమ్ లో సునీత మహేందర్ రెడ్డి, సునీతా ముదిరాజ్, కల్వా సుజాత, శశికల యాదవ్, వరలక్ష్మీ, భవాని, సరాఖాన్, మశ్రత్ సుల్తానా, ఇశ్రత్ ఉన్నిసా లు ఉండగా, మేయర్ గద్వాల విజయలక్ష్మీ టీమ్ లో సురేఖ, విజయారెడ్డి, సంధ్యారెడ్డి, స్వర్ణకుమారి, పాలడుగుల పద్మ, ఘాన్సీ రెడ్డి, ఇందిరా శోభన్, రమ్యారావు, ధనలక్ష్మీ గౌడ్ లు ఉన్నారు.

ఎన్ పద్మావతి టీమ్ లో ఆత్రం సుగుణ, అలేఖ్య, ధన్యవంతి, సౌజన్య గౌడ్, ఉజ్మా షకీర్, రేణుకా నారాయణ, హైమావతి, కల్పనారెడ్డి, స్వరూప రాణిల ఉండగా, మామిడాల యశస్వీని రెడ్డి టీమ్ లో కోటా నీలిమా, కల్పనా యాదవ్, నీలం పద్మ, మంజులా రెడ్డి, శైలజా రెడ్డి, ఇందిరా శోభన్ , మేహరాజ్ బేగం, తన్వీర్ బేగం, రోజారెడ్డిలు ఉన్నారు. ఇక ఎంపీ కడియం కావ్య టీమ్ లో వెన్నెల, ఆకుల లలిత, నిర్మాలా రెడ్డి, సిరాజ్ ఖాన్, జక్కని అనిత, లతీఫ్​ బేగం, జమీలా, షబానా, సదా లక్ష్మీలు ఉన్నారు.

Read Also- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!

నేడు జూబ్లీహిల్స్‌లో సీఎం ప్రచారం

తెలంగాణ బ్యూరో, స్వేచ్చ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా షేక్‌పేట్ డివిజనల్‌లోని హనుమాన్ టెంపుల్ వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అంతేగాక రహమత్ నగర్ డివిజన్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో చేయనున్నారు. శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

Read Also – Sreeleela: శ్రీలీలకు హిట్టొచ్చేది ఎప్పుడు? ఇక ఆశలన్నీ ఆ సినిమాపైనే!

నవీన్ యాదవ్‌పై అసత్య ప్రచారాలు.. పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బడుగు బలహీన వర్గాలకు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్‌‌ని ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.

Just In

01

Dangerous Animal: పులి కాదు, సింహం కాదు.. ఇదే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జంతువు?

Visakhapatnam: విశాఖలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు.. ఇళ్ల నుంచి పరుగో పరుగు!

Konda Surekha: ధ‌ర్మ‌పురి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

Worlds Most Famous Places: ప్రపంచంలో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు ఇవే..

Coimbatore Crime: ప్రియుడితో షికారుకొచ్చిన విద్యార్థిని.. ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మృగాళ్లు.. పోలీసులు ఏం చేశారంటే?