Good News, Fighter Movie Entry on OTT
Cinema

OTT FIGHTER : ఓటీటీలోకి ఫైటర్ ఎంట్రీ..

Bollywood Hero Hrithik Roshan Is A Fighter in OTT : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అందాల నటి దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన మూవీ ఫైటర్. ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 25న రిలీజైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలై..బాక్సీఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది..రిలీజైన 31 రోజుల్లోనే సుమారు రూ.210 కోట్ల వసూళ్లను రాబట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ మూవీ థియేటర్లకు ఎంట్రీ ఇచ్చి రెండు నెలలు కావస్తున్నా.. ఇంతవరకూ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఆడియెన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా… మార్చి 21 నుంచి ఫైటర్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. కానీ ఇంతవరకూ ఫైటర్ స్ట్రీమింగ్ డేట్ పై నెట్‌ఫ్లిక్స్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇవేవి లేకుండానే.. స్ట్రీమ్ లైన్ చేస్తారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Read More:సింగర్‌ మంగ్లీకి తప్పిన ముప్పు

ఇక ఈ మూవీ ఎలా ఉండనుందంటే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సంషేర్ పఠానియా అలియాస్ పాటీ స్క్వాడ్రన్ లీడర్‌గా వర్క్‌ చేస్తుంటాడు. ధైర్యసాహసాలకు ఏమాత్రం వెనుకాడని ఫైటర్ పైలట్ అతను. తనకు అప్పజెప్పిన కర్తవ్యాలను నాన్‌స్టాప్‌గా నిర్వర్తించే క్రమంలో.. కొన్ని రూల్స్‌ అండ్‌ కండీషన్స్‌ని దాటి సాహసాలు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన ఓ ఘటనకు అతను బాధ్యుడని నిందపడుతుంది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఒక ఆపరేషన్ కోసమై శ్రీనగర్‌కు రీ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ సీఓ రాకీ సారథ్యంలో మిన్ను, తాజ్, బాష్ బృందం ఆపరేషన్ చేపడుతుంది. ఈ ఎయిర్ ఫోర్స్ టీమ్ గగనతలంలో శత్రువులపై ఎలా పోరాటం చేసింది ? పాటీ మళ్లీ రూల్స్ ను క్రాస్ చేశాడా ? లేదా రెండేళ్ల క్రితం ఏ ఘటనలో అతనిపై నిందపడింది ? అన్నదే ఈ మూవీలోని మిగతా స్టోరీ.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ