A Missed Threat For Singer Mangli: ప్రముఖ సింగర్ మంగ్లీకి పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనా శంషాబాద్ మండలం తొండుపల్లిలో జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి సింగర్ మంగ్లీ శనివారం హాజరయ్యారు. అర్థరాత్రి తర్వాత మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ నుండి బెంగళూరు నేషనల్ హైవే మీదుగా ఇంటికి బయల్దేరారు.
తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్.. వెనుక నుంచి వేగంగా వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.ఈ ఘటనలో మంగ్లీతో సహా..మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. కాగా.. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.టీవీ షోల నుంచి మొదలైన తన పాటల ప్రస్థానం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ సింగర్‌గా మారిపోయింది గాయని మంగ్లీ.
Read More: ఓటీటీలోకి హనుమాన్, భారీ ట్విస్ట్ ..!?
తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. అది ఫోక్ సాంగ్ అయినా సరే.. ఇటు ఐటెం సాంగ్ ఐనా సరే మంగ్లీ తర్వాతనే ఎవరైన అంటుంటారు చాలామంది. ఇక మంగ్లీ పాడే పాటలకు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. సింగర్‌గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా ఎదిగిపోయింది. వరుస మూవీ ఛాన్సులతో సినీ రంగంలో దూసుకెళ్తున్న మంగ్లీ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారుపడాల్సిన పనిలేదని తనకేం కాలేదని మంగ్లీ తనకు సన్నిహిత మీడియా మిత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. మంగ్లీకి ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయం తెలుసుకున్న అభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.