High Court (imagecredit:twitter)
తెలంగాణ

High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ప్రశ్న.. ఎప్పుడు నిర్వహిస్తారు?

High Court: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు(High Cort) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చెయ్యటంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. నిజానికి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ(BC)లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టగా అన్ని పార్టీలు దానికి మద్దతు కూడా తెలిపాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎలక్షన్లు జరుపటానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లపై కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై స్టే జారీ చేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.

Also Read: World Cup Fianal: ఫైనల్‌లో అమ్మాయిల అద్భుత బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్

అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ..

అయితే, అక్కడ కూడా సానుకూల ఫలితం రాలేదు. హైకోర్టు చెప్పినట్టుగా పాత పద్దతిలో ఎన్నికలు జరుపుకోవచ్చని సుప్రీం కోర్టు(Supreme Court) పేర్కొంది. దాంతో స్థానిక ఎన్నికల(Local elections) నిర్వహణ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సురేందర్(Surender) అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో సమాధానం చెప్పేందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Also Read: Bus Accidents In Telangana: తెలంగాణలో జరిగిన భయంకర బస్సు ప్రమాదాలు.. ఇవి ఎప్పటికీ పీడకలే!

Just In

01

GHMC: మార్చి కల్లా మరో 35 బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లు..పేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో సంచలనాత్మక నిర్ణయం

AICC: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్‌ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!

GHMC: 25న జీహెచ్ఎంసీ కౌన్సిల్.. వచ్చే ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ పై చర్చకు ఛాన్స్!

Ponguleti Srinivasa Reddy: జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో కాళేశ్వ‌రం అవినీతి సొమ్ముతోనే విచ్చలవిడి ప్రచారం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Kavitha: పత్తి తేమ శాతం సడలింపు ఇవ్వాలి.. కేంద్రానికి కవిత లేఖ!