Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్.. తమ అభ్యర్థిని ఎంఐఎం(MIM) నుంచి అద్దెకు తెచ్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్విహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అన్ని హద్దులు దాటి మితి మీరి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మజ్లిస్ నుంచి అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలు బీజేపీ(BJP)పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక వర్గానికి తాయిలాలు అందిస్తున్నారని ఆరోపించారు.
కిషన్ రెడ్డి సవాల్..
బంజారాహిల్స్ లో గుడి కూలకొట్టి విగ్రహం మాయం చేశారని, గుడికి స్థలం ఇవ్వడం చేతకాని కాంగ్రెస్(Congress)కు కబ్రస్థాన్ కు మాత్రం భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సన్న బియ్యం రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రజలను భయపెట్టారని, సీఎంకు ధైర్యముంటే ఉచిత బియ్యం పథకాన్ని నిలిపివేసి చూపించాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదా? లేక కేంద్ర ప్రభుత్వానిదా? అని ప్రశ్నించారు. ఉచిత బియ్యం పథకం రద్దు చేసేంత ధైర్యం రేవంత్ కు ఉందా అని చురకలంటించారు. బియ్యం పథకం రద్దు చేస్తామని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏంటో జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రజాపాలన అంటే బెదిరింపులకు దిగడమా అని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.
క్షమాపణలు చెప్పాలని..
రేవంత్ రెడ్(Revanth Reddy)డి దేశ జవాన్లను అవహేళన చేసి మాట్లాడుతున్నారని, ఢిల్లీ(Delhi)లో బడే మియా రాహుల్ గాంధీ(Rahul Gandhi), తెలంగాణ(Telangana)లో ఛోటే మియా రేవంత్ రెడ్డి.. ఇద్దరూ ఇద్దరేనని విమర్శించారు. అవకాశ వాద రాజకీయాలకోసం, అంతర్జాతీయ మెప్పు కోసం కాంగ్రెస్ భారత ఆర్మీని అవమానించిందని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సైన్యానికి, దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, కేటీఆర్(KTR) కు దమ్ముంటే జూబ్లీహిల్స్ లో 2 కిలోమీటర్లు నడిచి ప్రజలను ఓట్లడగాలని కేంద్ర మంత్రి సవాల్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) కు ఒప్పందాలు కుదిరాయని ఆరోపించారు. ఒప్పందాలు కుదిరినందుకే కేసీఆర్(KCR) అవినీతిపై పురోగతి లేదన్నారు.
ఎందుకు ఇలా అబద్ధాలు..
కిషన్ రెడ్డి మెట్రో(Mettro) అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారో తెలియడంలేదన్నారు. డిపీఆర్ తయారు చేయకుండా.. మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించడం ఆయనకు సమంజసమా అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం కృష్ణ కాంత్ పార్క్(Krishna Kant Park) లో వాకర్స్ ను కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తామెప్పుడూ కార్పెట్ బాంబింగ్ ప్రచారం చేస్తామని అఫీషియల్ గా చెప్పలేదని, తాము చేస్తున్నది మహాపాదయాత్రలని వివరించారు. ఈ ఎన్నికల సమయంలో అజారుద్దీన్(Azharuddin) కు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికల్లో చేపడుతున్న సర్వేలు బోగస్ అని, బీజేపీ(BJP)కి ఓటింగ్ శాతం ఎంత అనేని నిర్ణయించడానికి వారెవరని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఏసీ రూమ్ లో కూర్చుని చెబితే సర్వేలు అవుతాయా? అని ప్రశ్నించారు. గెలుపును సర్వేలు నిర్ణయించబోవని, ప్రజలు నిర్ణయిస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వందకు వంద శాతం గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు.
Also Read: Chevella Bus Accident Live Updates: ఘోర బస్సు ప్రమాదం.. ఎక్స్ గ్రేషియో ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
