Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 57వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 57) నామినేషన్స్ రచ్చ జరుగుతోంది. 56వ రోజు ఆదివారం హౌస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేటైన విషయం తెలిసిందే. తనూజ దగ్గర మాధురిని సేవ్ చేసే అస్త్రం ఉన్నా కూడా సేవ్ చేయకుండా, మాధురి ఎలిమినేషన్‌కు కారణమైంది. ఎలిమినేషన్ తర్వాత మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లుగా యాక్ట్ చేసింది. హౌస్‌లో కూడా తనూజని మాధురి ఎంతగానో నమ్మింది కానీ, ఎలిమినేషన్ టైమ్‌లో మాత్రం ఆ నమ్మకం వమ్ముచేసి సేవ్ చేయడానికి తనూజ ముందుకు రాలేదు. అది తెలియక.. మాధురి వెళుతూ వెళుతూ.. తనూజకే గులాబీ పువ్వు ఇచ్చి మరీ కప్పు కొట్టుకుని రమ్మని చెబుతుండటం చూస్తుంటే.. హౌస్‌లోని వారిని ఎంతగా తనూజ ఇన్‌ప్లూయెన్స్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ (Nominations Time) ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఈ నామినేషన్స్‌కు సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమో వచ్చేసింది. తాజాగా రెండో ప్రోమో వచ్చింది.
Also Read- Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?
బిగ్ బాస్‌పై కూడా డౌట్స్
ఈ రెండో ప్రోమోని గమనిస్తే.. తనూజ (Tanuja) అసలేం మారలేదని అనిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున (King Nagarjuna) క్లాస్ ఇచ్చినప్పటికీ తనూజలో ఏం మార్పు కనబడలేదు. గొడవలు పడవద్దు.. ఏం చేసినా నవ్వుతూ చేయాలని చెప్పినా కూడా.. నామినేషన్స్ టైమ్‌లో ఆమె రచ్చ రచ్చ చేస్తుంది. వాస్తవానికి ఆమె చేసే రచ్చకు ఎప్పుడో ఎలిమినేట్ కావాలి. కానీ అలా జరగడం లేదు. ఆడియెన్స్ ఈ విషయంలో బిగ్ బాస్‌పై కూడా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తనూజని బిగ్ బాస్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడని, అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదనేలా ఈ షో చూస్తున్న చాలా మంది.. ఈ ప్రోమోల కింద కామెంట్స్ చేస్తుండటం విశేషం. మిగతా హౌస్ మెంబర్స్ తప్పు చేసిన వీడియోలను చూపించే బిగ్ బాస్.. తనూజ విషయంలో మాత్రం వీడియోలు చూపించకుండా, ఆడియెన్స్ దృష్టి ఆమెపై పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడనేలా నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో? ఒకవేళ నిజమైనా కూడా ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ గేమ్. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలడు.
Also Read- Sudheer Babu: మహేష్ సపోర్ట్ తీసుకోలేదు.. సుధీర్ బాబు స్కెచ్ ఏంటి?
బాండింగ్స్ బద్దలవుతున్నాయ్..
సరే తాజాగా విడుదలైన ప్రోమో విషయానికి వస్తే.. ఇందులో బొమ్మను తీసుకోవడంలో తనూజ ఫెయిలైంది. ఇమ్మానుయేల్‌ను ఆమె నామినేట్ చేస్తుంది. ‘తను చాలా సేఫ్‌గా గేమ్ ఆడుతున్నాడనేది చాలా క్లియర్‌గా తెలుస్తుంది’ అని తనూజ అంటే.. ‘నా సపోర్టర్ ఎవరైనా సరే.. నేను మోయగలిగినంత వరకే మోయగలను. నాకు భుజాలు నొప్పి పెడుతున్నాయి, నువ్వు చచ్చిపోతావ్ అంటే దింపేస్తా..’ అని ఇమ్ము చెబుతుంటే.. ‘అంత బరువైనప్పుడు అసలు ఎక్కించుకోకు’ అని తనూజ అంటుంది. ‘అందుకే దింపేశా’ అని ఇమ్ము చెప్పడంతో.. ఇద్దరి మధ్య హోరాహోరీగా వాదన నడుస్తుంది. ఆ తర్వాత భరణిని డిమోన్ పవన్ నామినేట్ చేశాడు. తనూజని సాయి నామినేట్ చేశాడు. అనంతరం తనూజ, భరణిల మధ్య డిస్కషన్ నడుస్తుంది. ‘తనూజ వచ్చి నన్ను ఏ టాస్క్‌లోనూ సేవ్ చేయలేదు. తనని నేను రెండు టాస్క్‌లలో సేవ్ చేశాను’ అని భరణి అంటుంటే.. ‘సపోర్ట్ చేశారు.. ఎందుకంటే అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి’ అని తనూజ అంటుంది. హౌస్‌లో ఇప్పటి వరకు బాండింగ్ కొనసాగించిన భరణి, తనూజల మధ్య సీరియస్ ఫైట్ నడుస్తుంది. తనూజ నోటి పవర్ ఏంటో మరోసారి భరణిపై చూపిస్తుంది. భరణిని మాట్లాడనివ్వకుండా.. అరిచేస్తుంది. ‘ఏదయితే బాండింగ్ పేరుతో నేను బయటికి వెళ్లానో.. తను కూడా ఆ బాధ్యత తీసుకుని బయటకు వెళ్లి వస్తే.. తనకి కూడా పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. ఆమె బయటికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను’ అని భరణి స్ట్రాంగ్‌గా చెప్పాడు. ఇంతటితో ఈ ప్రోమో ముగిసింది. మొత్తంగా చూస్తే.. హౌస్‌లో బాండింగ్స్ ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయని అనిపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
