Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 టైటిల్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సినిమాకు ‘వారణాసి’ (Varanasi) అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా గత కొంతకాలంగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు వేరే బ్యానర్ ఆ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో రాజమౌళి టీమ్ కొత్త టైటిల్‌ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు చాలా టైటిల్స్ వినిపించినప్పటికీ, అంతా ‘వారణాసి’ అయితే బాగుంటుందనేలా.. సోషల్ మీడియాలో కూడా మద్దతు వచ్చింది. కానీ, రాజమౌళి మనసులో ఏముందనేది మాత్రం ఇంత వరకు ఎవరికీ తెలియదు. ఆఖరికి మహేష్‌కైనా తెలుసో? లేదో?
Also Read- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
సనాతన ధర్మం గొప్పదనంపై ‘వారణాసి’
రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందనున్న తమ కొత్త చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ, పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘రఫ్’ సినిమా దర్శకుడు సుబ్బారెడ్డి (Director Subbareddy) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తున్నారని, మరో స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే అందించనున్నారని మేకర్స్ స్పష్టం చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.భారతదేశంలో అత్యంత పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం జరుగుతుందని దర్శకుడు సుబ్బారెడ్డి వెల్లడించారు.
Also Read- Telugu Indian Idol Season 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ ఎవరంటే?
SSMB29కి ఇప్పుడు ఏ టైటిల్?
వాస్తవానికి, రాజమౌళి – మహేష్ బాబు చిత్రం ఒక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ అయినప్పటికీ, దాని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో త్రిశూలం, ఢమరుకం, నంది వంటి శివభక్తి చిహ్నాలు ఉండటం, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి ఘాట్‌లను పోలిన భారీ సెట్‌ను వేయడం వంటి కారణాల వల్ల ‘వారణాసి’ అనే టైటిల్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ పేరు అధికారికంగా మరొక సినిమాకు రిజిస్టర్ అవ్వడంతో, రాజమౌళి బృందం SSMB29 కోసం కొత్త టైటిల్ వేటలో పడింది. ‘మహారాజ్, గరుడ, జెన్ 63’ వంటి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నప్పటికీ, నవంబర్‌లో రాబోయే ఫస్ట్ గ్లింప్స్‌లో రాజమౌళి ఏ పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లబోయే ఈ పాన్-వరల్డ్ చిత్రానికి సంబంధించిన అసలు టైటిల్ ఏంటో తెలుసుకోవాలంటే, రాజమౌళి అధికారిక ప్రకటన కోసం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం టీమ్ అదే పనిలో ఉన్నట్లుగా శనివారం సోషల్ మీడియాలో టీమ్ జరిపిన సంభాషణను చూస్తే అర్థమవుతోంది. ఆ సంభాషణ అనంతరం ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్టకేలకు రాజమౌళిలో కదలిక వచ్చిందంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
