Transport Department ( image credit: swetcha reporter)
తెలంగాణ

Transport Department: రవాణా శాఖలో సమాచారం మిస్? కనిపించని సమాచార హక్కు బోర్డు!

Transport Department: ఏ కార్యాలయంలోనైనా సమాచారం హక్కు చట్టానికి సంబంధించిన వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేస్తారు. శాఖలోని వివిధ విభాగాలకు ఓ అధికారి సమాచారం ఇస్తారని బోర్డులో వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేసి పబ్లిక్ డోమెన్‌లో పెడతారు. కానీ, ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణాశాఖ అథారిటీ (ఎస్టీఏ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు. సమాచారం హక్కు చట్టానికి సంబంధించిన అధికారుల వివరాలను ఎస్టీఏ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో రిటైర్మెంట్ అయి సుమారు ఏడాది అవుతున్న జేటీసీగా పనిచేసిన మమతా ప్రసాద్ పేరు, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కేఈ జ్ఞానేశ్వర్ పేరును సమాచార హక్కు బోర్డులో ఉంచడం ఉద్యోగుల పనితీరుకు నిదర్శనం.

Also Read: Illegal Cattle Transport: చర్ల వయా భద్రాచలం టు కురవి .. స్వేచ్ఛ కథనం సోషల్ మీడియాలో వైరల్

అధికారులు చేసే తప్పిదాలపై సమాచారం అడుగకూడదనా?

నిత్యం రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్, జాయింట్ కమిషనర్‌తో పాటు సమీక్షలకు ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సైతం వెళ్తుంటారు. ఈ కార్యాలయంలోనే సమాచారహక్కు చట్టం వివరాలకు సంబంధించిన బోర్డు లేకపోవడం గమనార్హం. అక్టోబర్ 29వరకు సమాచారం హక్కు చట్టం వివరాలకు సంబంధించిన బోర్డును ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేశారు. అయితే, ఆ బోర్డును కూడా అధికారులు తాజాగా తొలగించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అంటే ఎస్టీఏ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డు లేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అధికారులు చేసే తప్పిదాలపై సమాచారం అడుగకూడదనా? లేకుంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ఉద్యోగులు, సిబ్బందిలోనే చర్చనీయాంశమైంది. అధికారులు కొత్తగా బోర్డును ఏర్పాటు చేస్తారా? లేదా అనేది చూడాలి. ఫొటో తీయడం తీసి అధికారులు బోర్డును తొలగించినట్లు సమాచారం.

Also Read: Transport Department: రవాణా శాఖలో కొత్త సంస్కరణలు.. ఎన్ఫోర్స్‌మెంట్ టీంల ఏర్పాటు సిద్ధం!

Just In

01

Seethakka: మహిళా సంక్షేమంపై నెదర్లాండ్‌లో అధ్యయనం.. విదేశీ పర్యటనలో మంత్రి సీతక్క

Kenya Landslides Tragedy: కెన్యాలో భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు 21 మంది మృతి, వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం

Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?

Hydra: కూకట్‌పల్లి చెరువుకు పూర్వవైభవం హైడ్రా అద్భుతం.. స్థానికుల ఆశ్చర్యం

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి