Illegal Cattle Transport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా పశువులను రవాణా (Illegal Cattle Transport )చేసే వ్యాపారులు సోమవారం సైలెంట్ గా ఉండిపోయారు. స్వేచ్ఛ వెబ్ సైట్ లో వచ్చిన లింక్, స్వేచ్ఛ న్యూస్ లో వచ్చిన కథనానికి విశేష స్పందన లభించింది. అక్రమ పశువుల వ్యాపారుల ఆగడాలపై కళ్ళకు కట్టినట్లుగా ప్రచురించిన కథనం పాఠకులను విశేషంగా ఆకర్షించింది. నిజా, నిజాలు ఖచ్చితమైన సమాచారంతో వెలుబడిన కథనం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అటు అధికారులు సైతం స్వేచ్ఛలో ప్రచురితమైన కథనానికి స్పందించి ఎక్కడ నుంచి ఎక్కడకు పశువుల అక్రమ రవాణా సాగుతుందనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా సమాచారం.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
దారి మళ్లించి కంటైనర్ ఎస్కేఫ్
స్వేచ్ఛ వెబ్ సైట్ లో వెలువడిన ఈ దందా అరికట్టేదెవరు..? లింక్ రెండు జిల్లాల్లో వైరల్ గా మారింది. ఇదే లింకు సంబంధిత వ్యాపారులు, సంబంధిత అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనదారులకు సైతం చేరిపోయింది. దీంతో పశువుల అక్రమ రవాణా రెండు రోజులపాటు బందు చేయాలని అటు రవాణా కు పాల్పడేవారు, అక్రమ పశువుల వ్యాపారులు సైతం రెండు రోజులు రాకపోకలు సాగించొద్దని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోకి ఎంట్రీ
అయితే స్వేచ్ఛ వెబ్ సైట్ లో వచ్చిన ఈ లింకు వైరల్ కాకముందే ఛత్తీస్గడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోకి ఎంట్రీ ఏడు రాళ్లపల్లి మీదుగా భద్రాచలం సమీపంలోని నెల్లిపాక మీదుగా భద్రాచలానికి రాకముందే వ్యవసాయ చెక్పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ లను వర్షం కురుస్తున్న సమయంలో కంటైనర్ దాటిపోయింది. అక్కడి నుంచి మణుగూరు క్రాస్ రోడ్డు, పాల్వంచ క్రాస్ రోడ్డు మీదుగా ఇల్లందు వయా మహబూబాబాద్ టూ కురవికి చేరిపోయింది. అక్కడి నుంచి వరంగల్ హైవే ఎక్కి తిరుమలగిరి మీదుగా వలిగొండ చేరుకొని హైదరాబాద్ కబేళాలకు చేరిపోయింది.
Also Read: OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?
స్వేచ్ఛ కథనం అక్షర సత్యం. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందు భారతి
పశువుల అక్రమ రవాణా పై ప్రచురించిన వార్తా కథనం అక్షర సత్యం. ఈ అక్రమ దందా అధికారులు, పోలీస్ శాఖ హస్తంతోనే నడుస్తుంది. గతంలో కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేశాను. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే నిజం లాగే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి గో అక్రమ రవాణా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు..? ఒక హైందవ బిడ్డగా చెక్పోస్టులు పెట్టి, సరైన అధికారులను పెట్టి పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్నా.
ఎందుకు దృష్టి సారించడం లేదు
అక్రమ పశువుల రవాణా గత కొన్ని ఏళ్లుగా సాగుతుంటే అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు. 13 నెలల కాలంలో సుమారు 250 గోవులను స్లాటర్ హౌస్(slaughter house)కు వెళ్లకుండా అడ్డుకున్నాం. మాకు తెలిసి 280, తెలియకుండా ఇంకా ఎన్ని గోవులు బలయ్యాయో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో అధికారులు, పోలీసులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే హైందవ బిడ్డలం స్లాటర్ హౌసు(slaughter house)ల మీద దాడి చేస్తాం.
Also Read: KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు