KA Paul (imagecredit:twitter)
హైదరాబాద్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

KA Paul: సందర్భం వచ్యిన ప్రతీసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించటంతోపాటు హాస్యాన్ని పండించే ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కే.ఏ.పాల్(K.A. Paul)​ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ తనను కే.ఏ.పాల్​ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పంజగుట్ట పోలీసులు(Panjagutta Police) వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇతర ఆధారాలతో..

కే.ఏ.పాల్(K.A. Paul) కు చెంది హైదరాబాద్(Hyderabad)లో ఉన్న కార్యాలయంలో ఓ మహిళ కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తోంది. కాగా, కే.ఏ.పాల్​ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆ మహిళ మొదట షీ టీమ్స్(She Teams)కు ఫిర్యాదు చేసింది. కే.ఏ.పాల్ తనకు పంపించిన వాట్సాప్​ మెసెజీలు, ఇతర ఆధారాలను వారికి అందచేసింది. షీ టీమ్స్​ పోలీసులు వీటిని పంజగుట్ట పోలీసులకు ఇచ్చారు. ప్రాథమిక విచారణలో కే.ఏ.పాల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టం కావటంతో పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read: MLC Kavitha: కవిత రాజకీయ ఎత్తుగడలు అక్కడి నుంచే..? ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

సంచలన ప్రకటనలు చేస్తూ..

కే.ఏ.పాల్ ప్రస్తుతం అమెరికా(USA)లో ఉన్నట్టు సమాచారం. ఆయన హైదరాబాద్(Hyderabad) రాగానే నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పంజగుట్ట పోలీసులు నిర్ణయించారు. అనంతరం అరెస్టు చేయనున్నారు. కే.ఏ. పాల్ తరచూ తన హాస్యాస్పద వ్యాఖ్యలతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అయితే ఈసారి ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల కేసుతో, ఆయన రాజకీయ జీవితానికి, సామాజిక ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎదేమైనా చట్టపరంగా ఇది సీరియస్ క్రిమినల్ ఆఫెన్స్ కేసుకింద దీన్నిమనం చూడవచ్చు.

Also Read: Crime News: ఐపీఎస్ ఐఏఎస్ అధికారులే ఆమె టార్గెట్.. కోట్లు కొల్లగొట్టిన ఛీటర్

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు