Crime News: మద్దిపాటి సంధ్యారాణి. మాట మృదువుగా ఉంటుంది. ఆపై భగవంతునిపై ఎంతో భక్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనుకున్న ఆమె దాని కోసం బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతోపాటు కొంతమంది రిటైర్డ్, విధుల్లో ఉన్న ఐపీఎస్(IPS), ఐఏఎస్(IAS) అధికారులను టార్గెట్ గా చేసుకుంది. వ్యాపారం పేర వారి నుంచి దాదాపు 600 కోట్లు కొల్లగొట్టి చివరకు పోలీసులకు పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారులతో పరిచయాలు
మద్దిపాటి సంధ్యారాణిది మధ్యతరగతి కుటుంబం. అయితే, జల్సా జీవితాన్ని కోరుకున్న ఆమె దీని కోసం మోసాలు చేయటం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 40 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పరిచయాలు పెంచుకుంది. ఎంతో భక్తి ఉన్నట్టుగా నటిస్తూ ప్రసాదాలు పంచుతూ అందరి నమ్మకాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత తాను నడుపుతున్న కంపెనీలకు భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చాయని ఫోర్జరీ డాక్యుమెంట్లు(Forged documents) సృష్టించి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, సివిల్ సర్వీసుల్లో ఉన్న కొందరు ఉద్యోగులకు చెప్పింది.
Also Read: Chevening Scholarship: తెలంగాణ మెరిట్ విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్షిప్!
విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు
లాభాలు పెద్ద మొత్తంలో వస్తాయని నమ్మించి పెట్టుబడిగా ఇచ్చిన డబ్బుతోపాటు లాభాలను కూడా ఇస్తానని నమ్మించింది. దాంతో పలువురు ఆమె కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కాగా, సంధ్యారాణి(Sandhyarani) చేతుల్లో మోసపోయిన ఓ బాధితుడు హైదరాబాద్(Hyderabad) సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమె బాగోతం బయట పడింది. కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు ఇటీవల సంధ్యారాణిని అరెస్ట్ చేసి చెంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు,. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీకి తీసుకుని ఎంతమందిని? ఎంత మేర? మోసగించిందన్న వివరాలు తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: కుటుంబ సమస్యను బజార్ లోకి తెచ్చారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు