Illegal Land Surveys ( image CREDIT: Swetcha reporter)
నార్త్ తెలంగాణ

Illegal Land Surveys: దళిత రైతుల భూములపై అక్రమ సర్వేలు.. ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Illegal Land Surveys: కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలో దళిత రైతుల భూములపై అక్రమ సర్వేలు(Illegal Land Surveys) నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ రాపోలు నాగుపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల తరఫున యాదాల శ్రీనివాస్ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్ విచారణలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం కొమ్మేపల్లి గ్రామంలో జరిగిన సర్వేలపై సమర్పించిన నివేదికలను కమిషన్ సమీక్షించి అనంతరం నవంబర్ 4వ తేదీన విచారణకు హాజరుకావాలని యాదాల శ్రీనివాస్‌కు ఆదేశించింది. .

Also Read: Khammam District Survey Department: హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం.. కాసులు ఇస్తేనే సర్వేలు

రాపోలు నాగు సత్తుపల్లి మండల పరిధిలో చట్టవిరుద్ధంగా సర్వేలు

శ్రీనివాస్ మాట్లాడుతూ, రాపోలు నాగు 2025 మార్చిలోనే సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చినట్లు, అంతకు ముందు ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేశాడని RTI ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే 2023 సెప్టెంబర్‌లోనే రాపోలు నాగు సత్తుపల్లి మండల పరిధిలో చట్టవిరుద్ధంగా సర్వేలు నిర్వహించాడని, ఆ సమయంలో దళిత రైతుల్లో కొందరు హైకోర్టును ఆశ్రయించి తమ భూములపై WP 15290/2023 మరియు WP 24731/2023 కేసుల్లో స్టే ఆర్డర్లు పొందారని తెలిపారు.

రెవెన్యూ అధికారులపై కంటెంప్ట్ కేసు

అయినప్పటికీ రాపోలు నాగు స్టే ఆర్డర్లను ధిక్కరించి సర్వేలను కొనసాగించడంతో, మండల రెవెన్యూ అధికారులపై కంటెంప్ట్ కేసు (CC 387/2024) నమోదైందని శ్రీనివాస్ ఆరోపించారు. ఆ కేసుల నుండి బయటపడటానికే రాపోలు నాగు వ్యవసాయ భూములను ఫారెస్ట్ భూములుగా చూపిస్తూ తప్పుడు రిపోర్టులు తయారు చేశారని, ఇది దళిత రైతులపై కక్ష సాధింపుగా మరియు మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. తన వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ధరణి మ్యాప్‌లు, మండల సర్వేయర్ నివేదికలు సహా అన్ని ఆధారాలను మానవ హక్కుల కమిషన్ ముందు సమర్పిస్తానని, రాపోలు నాగు డిప్యూటేషన్ రద్దు చేసి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయబోతున్నట్లు తెలిపారు.

Also Read: Land Surveyors: సర్వేయర్ పోస్టులకు నామమాత్రంగా దరఖాస్తులు.. ఎంతంటే?

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?