Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఆ రికార్డులు ఖాయం..
devi-sri prasad( image:X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఆ రికార్డులు కొట్టడం ఖాయం అంటున్న దేవీశ్రీ ప్రసాద్..

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు దీవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. సినిమా విషయానికొస్తే.. సినిమాలో ప్రతి మూమెంట్ అభిమానులను పిచ్చెక్కించేలా ఉంటుందని, అభిమాని అశించే అన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా రెండు పాటలు చాట్ బాస్టర్లుగా మారతాయని అన్నారు. పూర్తయిన ఓ పాటను చూసినపుడు మాటలు రాలేదన్నారు. ఏది ఏమైనా ఈ సినిమా అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీన్ని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలలో ఫైట్స్ చూస్తుంటే పూనకాలు తెప్పించేలా ఉంటాయని దర్శకుడు పలు సందర్భాల్లో చెప్పారు. దేవీశ్రీ తాజా సమాచారంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో మాస్ ఫెస్ట్ సిద్ధంగా ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ పోర్షన్స్ సెప్టెంబర్‌లోనే ముగిసినప్పటికీ, మిగిలిన షెడ్యూల్స్ పూర్తి చేస్తూ యూనిట్ బిజీగా ఉంది. 2026 మార్చిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్‌తో అభిమానులను ఆకట్టుకునేలా రానుంది. IPS అధికారి తన కుటుంబాన్ని మర్డర్ చేసిన పాత శత్రువుల నుంచి తప్పించుకోవడానికి తాను, కూతురు మరణాలు ఫేక్ చేసుకుంటారు. కానీ శత్రువులు వాళ్లు బతికే విషయం తెలిసిన వెంటనే ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. హరీష్ శంకర్ స్క్రిప్ట్‌లో ఈ కాన్సెప్ట్‌ను మాస్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్‌లు ఇచ్చిన డైరెక్టర్ ఈసారి పవన్ కళ్యాణ్‌తో మ్యాజిక్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ బలంగా ఫిక్స్ అయ్యారు.

Read also-Natural Star Nani: రామ్ చరణ్‌కు పోటీగా.. మెగా ఫ్యాన్స్‌ని ఇరకాటంలో పెట్టిన నాని!

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో IPS అధికారి రోల్‌లో కనిపించనున్నారు. హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌లో పంకజ్ త్రిపాఠి, అశుతోష్ రాణా, ఆర్. పార్థీబన్ వంటి నటులు ఉన్నారు. ఇటీవల పార్థీబన్ సెట్స్‌లో హరీష్ శంకర్‌కు సైన్డ్ మెమెంటో గిఫ్ట్ చేశారు. “బ్లాక్‌బస్టర్ డైరెక్టర్” అని ప్రశంసిస్తూ, హరీష్ వర్క్‌కు ఇంప్రెస్ అయ్యారట. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

Just In

01

Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు

Uttam Kumar Reddy Warning: భయం ఉన్నోళ్లు వెళ్లిపోండి.. నేను రంగంలోకి దిగుతా.. మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

Live-in Relationships: లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ చట్టవిరుద్ధం కావు.. 12 జంటలకు రక్షణ ఇచ్చిన హైకోర్టు

Ram Goapal Varma: ఇండస్ట్రీకి ధురంధర్ గుణపాఠం.. హీరోలకు ఎలివేషన్స్ అక్కర్లే.. డైరెక్టర్లకు ఆర్జీవీ క్లాస్!

Karimnagar Cricketer: ఐపీఎల్‌లో కరీంనగర్ కుర్రాడు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అమన్ రావు ఎంపిక!