prasanth-varma(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

Prasanth Varma: హనుమాన్ సినిమాతో దేశాన్ని తనవైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కష్టాలు తప్పడంలేదు. ‘హనుమాన్’ సినిమా సక్సెస్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తరపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ)లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)కు సంబంధించిన ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, ఆడంబరాలపై ఆధారపడి ఉంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Read also-Mass Jathara collection: రవితేజ ‘మాస్ జాతర’ డే 1 కలేక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డు బ్రేక్..

నిరంజన్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం, ప్రసాంత్ వర్మ 2022 నుంచి 2024 వరకు ఐదు ప్రాజెక్టులకు మొత్తం 20.57 కోట్ల రూపాయల అడ్వాన్స్‌లు స్వీకరించారు. ఈ ప్రాజెక్టులు.. అధిర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస్, ఆక్టోపస్. ఇవి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు, క్యాష్ రూపంలో ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ప్రసాంత్ వర్మ ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టడంలేదా పూర్తి చేయలేదని, ఏకతరఫుగా డైరెక్టర్లను మార్చారని (ఉదా: అధిరకు విజయ్ బిన్నీ, మహాకాళీకు పూజా కొల్లూరు) ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టులను ఇతర స్టూడియోలతో (ఆర్‌కెడీ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్, హోంబాలే ఫిల్మ్స్ వంటివి) ప్రకటించి, అనుమతి లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆక్టోపస్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ ఫిర్యాదులో నిరంజన్ రెడ్డి రూ.20.57 కోట్లు ప్రిన్సిపల్‌తో పాటు 36% వడ్డీ, 200 కోట్ల డ్యామేజెస్ కాంపెన్సేషన్ డిమాండ్ చేశారు. అలాగే, ఈ ప్రాజెక్టుల ప్రొడక్షన్‌ను ఆపమని, సివిల్/క్రిమినల్ కేసులు వేయడానికి అనుమతి ఇవ్వమని కోరారు.

Read also-Mahesh and Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ.. సోషల్ మీడియా షేక్!

ప్రసాంత్ వర్మ తరపు వాదనల ప్రకారం, ‘హనుమాన్’ ప్రొడక్షన్‌లో నిరంజన్ రెడ్డి వైపు నుంచి లేట్ జరిగి తాను పెద్ద నష్టాలు చవిచూశానని చెబుతున్నారు. అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వడానికి తన వద్ద డబ్బు లేదని, హక్కులు తిరిగి తీసుకుని ఇతరులకు అప్పగించామని వాదిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫిర్యాదు మాత్రమే కాదు, ప్రసాంత్ వర్మపై మరిన్ని ఆరోపణలు ఉన్నాయి. ‘దేవకి నందన వాసుదేవ’ ప్రొడ్యూసర్లు రూ.1.5 కోట్లు డైరెక్షన్ కోసం ఇచ్చారు. కానీ ప్రసాంత్ వర్మ మరొకరిని డైరెక్టర్‌గా నియమించి సూపర్వైజర్‌గా మాత్రమే పని చేశారని, స్టోరీకి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. వారు రూ.1.5 కోట్లు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, మొక్షగ్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా పెద్ద మొత్తంలో అడ్వాన్స్ లు తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

Jogi Ramesh Arrest: సడెన్‌‌గా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ అందుకేనా?.. గంటాపథంగా వైసీపీ చెబుతున్న కారణం ఇదే

45 The Movie: ‘45 ది మూవీ’ నుంచి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్ వచ్చింది చూశారా..

Hyderabad Police: సైబరాబాద్ షీ టీమ్స్ జులాయిలపై దాడి.. 142 డెకాయ్ ఆపరేషన్లలో 76 మంది అరెస్ట్, 29 జంటలకు కౌన్సెలింగ్

CMRF Cheques Distribution: పేదలకు అండగా వొడితల ప్రణవ్.. 135 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Tollywood star kids:  స్టార్ కిడ్స్‌కి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయా?.. టాలెంట్ అక్కర్లేదా?..