Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్యాసింజర్లకు కాస్త నిరాశ కలిగించే నిర్ణయం ప్రకటించింది. సర్వీస్ టైమింగ్స్‌లో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పటివరకు మెట్రో సర్వీసులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు మొదలయ్యి.. రాత్రి 11.45 గంటల వరకు కొనసాగేవి. అయితే, తాజాగా సమయ వేళల సవరణ ప్రకారం, రాత్రి 11 గంటలకే సర్వీసులు బంద్ అవుతాయి. చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.
సవరించిన ఈ టైమింగ్స్ 2025 నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారికంగా శనివారం ప్రకటించింది. అన్ని టర్మినల్ స్టేషన్లు, వారంలోని అన్ని రోజుల్లో ఇవే సమయ వేళలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మార్పులకు అనుగుణంగా ప్యాసింజర్లు తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. తదుపరి నోటిసు వచ్చేంత వరకు ఈ టైమింగ్స్ కొనసాగుతాయని, సేవల విషయంలో తమకు సహకరిస్తున్నందుకు ప్యాసింజర్లకు ధన్యవాదాలు అని పేర్కొంది.
ప్రస్తుతం టైమింగ్స్ ఇలా..
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుత ఆపరేటింగ్ టైమింగ్స్‌ను పరిశీలిస్తే, శనివారం ఉదయం 6 గంటలకు సర్వీసులు ప్రారంభమై, రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. మరుసటి రోజైన ఆదివారం ఒక గంట ఆలస్యంగా ఉదయం 7 గంటలకు సేవలు మొదలవుతాయి. కానీ, ముగింపు మాత్రం శనివారం మాదిరిగానే రాత్రి 11 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది. ఇక సాధారన వర్కింగ్ డేస్, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు సేవలు, మొదలై రాత్రి 11.45 గంటలకు ముగుస్తున్న విషయం తెలిసిందే.
Revised Metro Timings | Effective 03 Nov 2025
Metro services will now run from 6:00 AM to 11:00 PM from all terminal stations on all days of the week
We request passengers to plan their travel accordingly.
Thank you for your cooperation.
[Hyderabad Metro, L&T Hyderabad… pic.twitter.com/BJlsnUSnIw
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 1, 2025
