Hydra ( image credit: swetcha reporter)
హైదరాబాద్

Hydra: రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!

Hydra: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా (Hydra) కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాలపరిదిలో 500 ప్లాట్లతో లేఔట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడడం గమనార్హం. ఇదే విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు హైడ్రా వెల్లడించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Also ReadHydra: రూ. 39 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా!

లేఔట్ వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించిన వారి కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్ తో 4 వేల గజాలను, 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేసినట్టు తేలింది. కులకర్ణి అనే వ్యక్తి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేష్, సోమాని తో పాటు పలువురికి అమ్మేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ విషయమై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆశ్రయించారు.

4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్

ఈ రకంగా దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ సమస్యతో గత నెల సెప్టెంబరులో హైడ్రాను ప్రతినిధులు ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసి, పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డు లు ఏర్పాటు చేశారు. దీంతో పార్కు స్థలానికి కబ్జా నుంచి విముక్తి లభించినట్టయింది. ఎట్టకేలకు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావటంతో కాలనీ ప్రతినిధులు ఊపరిపీల్చుకున్నారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Hydra: పార్కుల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్.. ఆక్రమణలు కబ్జాలపై ఫోకస్!

Just In

01

Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా?… కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు

Gadwal District: గట్టు ఎత్తిపోతల పూర్తయ్యేనా? 1.32 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంపెంపుకు అంగీకారం!

Mass Jathara Review: రవితేజ ‘మాజ్ జాతర’ ప్రేక్షకులను మెప్పించిందా?

Baahubali The Epic: ‘బాహుబలి ది ఎపిక్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డులు బ్రేక్..

Gadwal District: ధర్మవరం బిసి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత