HyderabadRains ( image credit: swwetcha reporter)
హైదరాబాద్

Hyderabad Rains: భారీ వర్షంతో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన జ‌ల‌మండ‌లి ఎండీ

Hyderabad Rains: తూఫాన్ ఎఫెక్టుతో నగరంలో కురుస్తున్న భారీ వర్షాలవ‌ల్ల ప్ర‌జ‌లకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్ లు (ఈఆర్‌టీ) అలర్ట్ గా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు బుధవారం ఉదయం ఆయ‌న సంబంధిత అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ టెలీ కాన్ఫ‌రెన్స్ లో మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు (ఈఆర్టీ), ఎస్పీటి వాహనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వాన.. రంగంలోకి నగర కమిషనర్లు.. క్షేత్రస్థాయిలో పర్యటన

కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

నీరు నిలిచే ప్రాంతాలపైన ఈ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు 24 గంటలు క్షేత్ర స్థాయిలో సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని ఆయ‌న సూచించారు. ఇత‌ర వివ‌రాలకు జ‌ల‌మండ‌లి క‌స్ట‌మేర్ కేర్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

క్షేత్ర స్థాయిలో ఈడీ పర్యటన

భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ సైతం నగరంలోని ఓ అండ్ ఏం డివిజన్‌ నెంబర్ 6 పరిధిలోని ఎస్‌.ఆర్‌.నగర్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ ప్రాంతాలలో సీజీఎం జీఎంలతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా అయన స్థానికంగా లో -ప్రెషర్ వాటర్ సప్లై ఫిర్యాదులపై చర్చించి, త్వరగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాన్ హొళ్ళ పూడికతీతలో ఉపయోగిస్తున్న ఎయిర్‌టెక్‌ మెషిన్‌ కార్యకలాపాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏఏంఎస్ భాగంగా చేపట్టే పనుల ప్రగతిని సమీక్షించి, కలుషత నీటి, సీవరేజ్‌ ఓవర్‌ఫ్లోలు తదితర పెండింగ్‌ ఏంసిసీ ఫిర్యాదుల పురోగతిని ఆరాతీశారు.

Also Read: Hyderabad Rains: రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం.. జలమయమైన సిటీ రోడ్లు

Just In

01

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?

Akhanda 2: సర్వేపల్లి సిస్టర్స్.. థమన్ అసలు ఏం చేస్తున్నావయ్యా?