Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజా పాలన ప్రభుత్వం లో సంక్షేమం అభివృద్ధి కి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ బై ఎలక్షన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని.. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి, బీఆర్ఎస్ అబద్దాలకు మధ్య పోరుగా మంత్రి అభివర్ణించారు.
‘ఏది కావాలో తేల్చుకోండి’
జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మీకు అభివృద్ధి కావాలా? అబద్ధాలు కావాలా?’ తేల్చుకోవాలని జూబ్లీహిల్స్ ప్రజలకు అల్టీమేటం జారీ చేశారు. ‘జూబ్లీహిల్స్ లో బండలను కరిగించి పేదలకి ఇండ్ల పట్టాలు, ఇండ్లు కట్టించి ఇచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి చూపింది కాంగ్రెస్. సన్న బియ్యంతో మీ ఆకలి తీర్చింది కాంగ్రెస్’ అంటూ పొన్నం చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలపై
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోందని మంత్రి పొన్నం అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల మందికి పైగా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రూ.500కి గ్యాస్ అందిస్తున్నాం. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నాం. 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని పొన్నం వివరించారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు
బీఆర్ఎస్ (BRS) తన 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పొన్నం విమర్శించారు. ఓటు చోరీ అంటూ బీఆర్ఎస్, బీజేపీ (BJP) ఓటు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. ‘మా అభ్యర్థి బీసీ బిడ్డ, విద్యావంతుడు, నిత్యం ప్రజల్లో ఉండే నవీన్ యాదవ్ ను రౌడీ అంటున్నారు. వాళ్ళు ఎన్ని అన్న అవి మా ఆశీర్వాదాలు. ఇప్పుడు ఆటోలో ప్రయాణం చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. 2012 తరువాత నగరంలో ఒక్క ఆటోకి పర్మిట్ ఇవ్వలేదు. మేము 20వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చాం. 10 వేల సీఎన్‌జీ, 10 వేల ఎల్‌పీజీ అటోలకు అనుమతి ఇచ్చాం. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇచ్చే దానిపై మాకు చిత్తశుద్ధి ఉంది’ అని పొన్నం స్పష్టం చేశారు.
Also Read: IND vs AUS 1st T20: ఆసీస్‌తో ఫస్ట్ టీ20.. టాస్ పడిందోచ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..
జూబ్లీహిల్స్ లో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత 10 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి ఏం చేశారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ‘రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆ లేక యూసుఫ్ గూడా డివిజన్ అధ్యక్షుడా. దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు జూబ్లీహిల్స్ ను నిర్లక్ష్యం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆ పార్టీలు ఏం చేశారో చర్చపెట్టాలి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, బీజేపీలు కలిపి పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ విధానాలను చెప్పే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించారు’ అంటూ సెటైర్లు వేశారు.
