IND vs AUS 1st T20 (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

IND vs AUS 1st T20: ఆసీస్‌తో ఫస్ట్ టీ20.. టాస్ పడిందోచ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND vs AUS 1st T20: ఆస్ట్రేలియా భారత్ మధ్య టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఐదు టీ20ల్లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. రాబోయే టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతుండటంతో యావత్ క్రికెట్ లవర్స్ దృష్టీ ఈ టీ20 సిరీస్ పై పడింది. అయితే వన్డేల్లో 2-1 తేడాతో ఓటమి చవిచూసిన టీమిండియా.. టీ20ల్లోనైనా గెలిచి ఆసీస్ కు షాకివ్వాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే కాన్బెర్రాలోని మానుకా ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. తాజాగా టాస్ పడింది.

బ్యాటింగ్ ఎవరిదంటే?

టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్.. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ లో తలపడే జట్టును కెప్టెన్ సూర్యకుమార్ రివీల్ చేశాడు.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (C) శుభ్‌మన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

పిచ్ రిపోర్ట్..

మానుక ఓవల్ మైదానంలో పిచ్ కాస్త నెమ్మదిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. క్రీజులో కుదురుకున్న బ్యాటర్లు మంచి స్కోర్ సాధించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పిచ్ పై యావరేజ్ స్కోర్ 150 పరుగులుగా చెబుతున్నారు. ఇక ఇదే మైదానంలో భారత్ – ఆసీస్ మధ్య ఒకే ఒక్క టీ20 మ్యాచ్ జరిగింది. 2020లో జరిగిన ఆ మ్యాచ్ లో 161 పరుగులు చేసిన భారత్.. 11 పరుగుల తేడాతో ఆసీస్ ను ఓడించింది. వాతావరణం విషయానికి వస్తే.. మ్యాచ్ మధ్యలో చిరుజల్లులు పడే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఆటకు పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు.

భారత్‌దే పైచేయి..

భారత్ ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 32 టీ20 మ్యచ్ లు జరిగాయి. అందులో భారత్ 20 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఆసీస్ 11 గెలిచింది. ఒకటి డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే 2007లో జరిగిన తొలి టీ20 నుంచి ఆసీస్ పై భారత్ ఆదిపత్యం కొనసాగిస్తోంది. స్వదేశంతో పాటు విదేశీ గడ్డలపైనా ఆసీస్ ను పలుమార్లు భారత్ ఓడించింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత్ సైతం ఆ రికార్డ్ ను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల ఆసియా కప్ గెలిచిన జట్టుతో భారత్ బరిలోకి దిగుతుండటం కలిసిరానుంది.

Also Read: TG Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రంగంలోకి ప్రభుత్వం.. మంత్రి పొంగులేటి కీలక ఉత్తర్వులు

5 మ్యాచ్ ల టీ20 సిరీస్..

ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఆడే టీ20 మ్యాచ్ ల జాబితాను గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. నేడు (అక్టోబర్ 29) టీ20 జరగనుండగా.. 31న రెండో మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 2న మూడో టీ20, నవంబర్ 6న నాల్గో టీ20, నవంబర్ 8న ఐదో టీ20 జరగనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్  లను స్టాప్ స్పోర్ట్స్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. అలాగే జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ లో చూడవచ్చు.

Also Read: Cyclone Montha: మెుంథా తుపాను ప్రభావం.. మత్స్యకారులకు సీఎం శుభవార్త.. కీలక ఆదేశాలు జారీ

Just In

01

Mahabubabad SP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కీలక సూచనలు

Azharuddin: నిజమా!.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి?.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఊహించని ట్విస్ట్?

Mahabubabad: తుఫాన్‌ను జయించిన తెగువ.. రెండు ప్రాణాలకు పునర్జన్మ ఇచ్చిన 108 యోధులు!

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వాన.. రంగంలోకి నగర కమిషనర్లు.. క్షేత్రస్థాయిలో పర్యటన

Mahabubabad Cyclone Montha: మహబూబాబాద్ జిల్లాలో మొంథా బీభత్సం.. నిలిచిపోయిన పలు రైళ్లు.. రంగంలోకి జిల్లా ఎస్పీ!