Shreyas Iyer Injury: వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో ODI మ్యాచ్‌లో గాయపడ్డాడు. అలెక్స్ కారీని అవుట్ చేయడానికి వెనుక పాయింట్ నుంచి పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నప్పుడు, అతని ఎడమ దిగువ పక్కటెముక డెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఇంపాక్ట్ గాయం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే అతని విటల్స్ (వాటల్ పేరామీటర్స్) డేంజరస్‌గా తక్కువగా ఉండటంతో స్పృహ కోల్పోయాడట. వైద్యులు, ఫిజియో వెంటనే చర్య తీసుకుని, అతన్ని సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు. స్కాన్లలో ప్లీహాకు (స్ప్లీన్) లాసరేషన్ గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ తేలింది. ఇది ప్రాణాంతకమైన స్థితి కావచ్చని చెబుతున్నారు.
BCCI అధికారిక ప్రకటన
అతను కోలుకుంటున్నాడని BCCI నేడు అధికారిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ” శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో మూడో ODIలో (అక్టోబర్ 25, 2025) ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమ దిగువ పక్కటెముక ప్రాంతానికి ఇంపాక్ట్ గాయం జరిగింది. మరిన్ని చెకప్‌ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కాన్లలో ప్లీహాకు లాసరేషన్ గాయం తేలింది. అతను చికిత్స పొందుతున్నాడు, వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడు. బాగా కోలుకుంటున్నాడు. ” అంతేకాదు, BCCI వైద్య బృందం సిడ్నీ, భారతదేశంలోని స్పెషలిస్టులతో కలిసి అతని కండిషన్‌ను క్లోజ్‌గా మానిటర్ చేస్తోంది. భారత జట్టు డాక్టర్ శ్రేయాస్‌తో పాటు సిడ్నీలోనే ఉండి, రోజువారీ ప్రాగ్రెస్ చెక్ చేస్తారని ప్రకటించారు.
Also Read: Kurnool Bus Fire Accident: బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
ICUలో 2 రోజులు.. 2-7 రోజుల
శ్రేయాస్ గత రెండు రోజులుగా సిడ్నీ ఆసుపత్రి ICUలో (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఉన్నాడు. రక్తస్రావం కనుగొనబడిన వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. సంక్రమణ వ్యాప్తిని ఆపడానికి, కోలుకోవడం బట్టి 2 నుంచి 7 రోజుల వరకు ఆబ్జర్వేషన్‌లో ఉంటాడని చెప్పారు. పరిస్థితి ఇప్పుడు స్టేబుల్‌గా ఉంది, కానీ మొదట్లో ప్రాణాలకు ప్రమాదం ఉండవచ్చని టాక్ వచ్చింది.
రికవరీ ఎంత సమయం తీసుకుంటుంది?
మొదట్లో 3 వీక్స్ రికవరీ అవుతారని చెప్పారు, కానీ అంతర్గత రక్తస్రావం కారణంగా ఇప్పుడు మరింత టైమ్ పట్టవచ్చు. అయితే, క్రికెట్‌కు తిరిగి రావడానికి ఖచ్చితమైన టైమ్‌లైన్ చెప్పడం కష్టమని అంటున్నారు. భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ఫిట్ అవ్వడానికి కొన్ని వారాలు పట్టవచ్చని చెబుతున్నారు.
