Kurnool Bus Fire Accident (Image Source: Twitter)
తెలంగాణ

Kurnool Bus Fire Accident: బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

Kurnool Bus Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్ బస్సు (Vemuri Kaveri Travel Bus).. కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చేరగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.

పొన్నం అధికారిక ప్రకటన

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

డీఎన్ఏ పరీక్షలకు బాడీలు

బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను కర్నూలు జిల్లా కలెక్టర్ (Kurnool Disrtct Collector) అధికారికంగా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కలెక్టర్ సిరి తెలియజేశారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు కలిపి మెుత్తం 27 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం ఘటనాస్థలిలోని బాడీలను మార్చురీకి తరిలించినట్లు తెలిపారు. డీఎన్ఏ టెస్ట్ జరిపాక రిజల్ట్స్ కోసం రెండు రోజుల సమయం పడుతుందని అన్నారు. అనంతరం బాడీలను సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Also Read: Kurnool Bus Fire Accident: బెర్త్ కోసం చూస్తే పరలోకానికే.. స్లీపర్ డిజైన్లలో భారీ లోపాలు.. మంటలోస్తే తప్పించుకునే దారేది!

ప్రధాని మోదీ సైతం..

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రధాని మోదీ (Prime Minister Modi) సైతం ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేలను పీఎం సహాయ నిధి నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రమాద ఘటన తనను ఎంతగానో బాధించిందన్న మోదీ.. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ సంతాపం

మరోవైపు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందిస్తూ.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సైతం మృతులకు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.

Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం

Just In

01

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే.. నవీన్ యాదవ్ గెలుపు పక్కా.. మంత్రి పొన్నం ప్రభాకర్

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో స్వల్పంగా పెరిగిన ఓటర్లు.. ఎంతంటే?

The Girlfriend trailer: రష్మిక మందాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ వచ్చేసింది.. ఏం పర్ఫామెన్స్ గురూ..

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి 400 మెుబైల్స్.. ఒక్కసారిగా బ్యాటరీలు బ్లాస్ట్!

Harish Rao: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం