Kurnool Bus Accident (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. సీఎం చంద్రబాబు, పవన్ సంతాపం

Kurnool Bus Accident: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్ బస్సు (Vemuri Kaveri Travel Bus).. కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సును బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. పలువురు ఎమర్జెన్సీ డోర్ నుంచి తప్పించుకున్నారు. అయితే 22 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu).. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బస్సు ప్రమాదం ఘటన తీవ్ర దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సైతం ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఘటన గురించి తెలిసి షాక్ కు గురైనట్లు చెప్పారు. మృతుల కుటంబాలకు సంతాపం తెలపడంతో పాటు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ..

కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం తనకు చాలా బాధను కలిగించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో అందించనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50,000 అందిస్తామని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇలాంటి ఘటనలు ప్రజా రవాణా వ్యవస్థల భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతతో పాటు, వాహన నిర్వహణ బాధ్యతల్లో జవాబుదారితనం నిర్ధారించడం అత్యవసరం’ అని రాహుల్ అభిప్రాయపడ్డారు.

Also Read: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..!

చంద్రబాబు, పవన్ సంతాపం

ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu).. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ.. ప్రమాద ఘటన తన మనసును కలిచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అన్ని రకాలుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందిస్తూ.. ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు చేపట్టిందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

Also Read: Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం 20 మంది మృతి!

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్