CP Sajjanar: మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల పెను విషాదాలు జరుగుతున్నా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. పీకల దాకా మద్యం సేవించి వాహనాలతో రోడ్ల మీదకు వస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు ఇతరుల జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. రాత్రి సైబరాబాద్(Cyberabad) కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్(Drunken drive) టెస్టుల్లో ఏకంగా 457మంది పరిమితికి మించి మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు. వీరిలో 346మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు.
కేసులు నమోదు..
ఇక ఆటోలు నడుపుతూ 20మంది, కార్లు నడుపుతూ 86మంది, భారీ వాహనాలు డ్రైవ్ చేస్తూ 5గురు దొరికారు. వీరందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరచనున్నారు. గత వారం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని కోర్టుల్లో హాజరుపరచగా 317మందికి జరిమానాలు పడ్డాయి. మరో 19మందికి జైలు శిక్షలు పడ్డాయి. ఆరుగురికి ఒకరోజు జైలు శిక్ష, 13మందికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి.
Also Read: Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..
తాగి డ్రైవింగ్ చేసేవాళ్లు టెర్రరిస్టులు: సీపీ
కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంపై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. శివశంకర్ అనే యువకుడు మద్యం తాగిన మత్తులో బైక్ నడుపుతూ తన ప్రాణాలు పోగొట్టుకోవటంతోపాటు మరో 19మంది చనిపోవడానికి కారణమయ్యాడన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, నిర్లక్ష్య.. నేరపూరిత చర్య అని పేర్కొన్నారు. మందు కొట్టి డ్రైవింగ్ చేసేవాళ్లు టెర్రరిస్టులు.. మానవ బాంబులని వ్యాఖ్యానించారు. తాగి ప్రమాదాలు సృష్టిస్తున్న వారి కారణంగా ఎన్నో కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read: NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?
