satish-shaw( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

Satish Shah passes away: భారతీయ సినిమా, టెలివిజన్ ప్రపంచం నుంచి ఒక మహానటుడు వెళ్లిపోయాడు. ‘సరభాయ్ వర్సెస్ సరభాయ్’ సీరియల్‌లో ఇంద్రనీల్ సరభాయ్ పాత్రకు ఆదర్శంగా నిలిచిన వెటరన్ నటుడు సతీశ్ షా, 74 ఏళ్ల వయస్సులో మరణించారు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఆయన మరణించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణం వార్త విని సినిమా పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతి చెందింది.

Read also-The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

సతీశ్ షా మరణానికి కొన్ని గంటల తర్వాతే, ముంబైలోని పి.డి. హిందూ జా హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ సెంటర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసుపత్రి ప్రకటన ప్రకారం, ఆయన ఇంటి నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన తర్వాత, మెడికల్ టీమ్‌తో కూడిన ఆంబులెన్స్ వెంటనే చేరుకుంది. ఆంబులెన్స్‌లోనే CPR (కార్డియోపల్మనరీ రీససిటేషన్) ప్రారంభించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా చికిత్సలు కొనసాగించినప్పటికీ, ఆయనను తిరిగి బతికించలేకపోయాయి. “ షా భారతీయ సినిమా టెలివిజన్‌కు చేసిన అసాధారణ సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. మేము ఆయన కుటుంబం, స్నేహితులు మరియు శ్రాద్ధాస్తులకు ఈ కష్టకాలంలో మా హృదయపూర్వక సానుభూతిని తెలుపుతున్నాము” అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Read also-Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

‘సరభాయ్ వర్సెస్ సరభాయ్’ సృష్టికర్త జె.డి. మజేథియా మాట్లాడుతూ.. సతీశ్ షా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. మూడు నెలల ముందు ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. కానీ, తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి, ఆరోగ్యం మరింత దిగజారడంతో మరణానికి కారణమైందని ఆయన వివరించారు. “ఆయన చాలా ధైర్యవంతుడు. చివరి క్షణాల వరకు కూడా హాస్యం మరచలేదు” అని మజేథియా గుర్తుచేశారు. సతీశ్ షా అంత్యక్రియలు అక్టోబర్ 26న అంత్యక్రియలు ముంబైలోని పవన్ హాన్స్ క్రమేషన్ గ్రౌండ్లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబడతాయి. విషయం తెలుసుకున్న బాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?