HMDA-Report (Image source Whatsapp)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

HMDA Report: హైదరాబాద్‌లో వేగంగా భవన నిర్మాణాలు.. లేఔట్‌లకు అనుమతులు.. హెచ్ఎండీఏ కీలక రిపోర్ట్ విడుదల

HMDA Report: అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి

వేగవంతంగా బిల్డింగ్, లేఔట్ల అనుమతులు
రికార్డు స్థాయిలో రూ.1,225 కోట్ల ఆదాయం
గతేడాదితో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు
ఈ ఏడాది 9 నెలల్లోనే 88 లక్షల చ.మీ.కు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతి
ఫైళ్ల పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ
రిపోర్టులో పేర్కొన్న హెచ్ఎండీఏ

హైదరాబాద్ నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండిఏ (HMDA Report) ప్రగతితో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల లేఔట్లు, విల్లా లేఔట్ల అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తున్నట్టు వెల్లడించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలలలోనే అనుమతుల మంజూరు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ అద్భుతమైన పనితీరును ప్రదర్శించినట్టు తెలిపింది.

హెచ్ఎండీఏ ప్రస్థానంలో ప్రధానమైన అంశం నిర్ధిష్ట కాలపరిమితిలో దరఖాస్తుల పరిష్కారం, ఈ విషయంలో ఈ ఏడాది గొప్ప ప్రగతిని సాధించినట్టు తెలిపింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ ఈ తొమ్మిది నెలల్లో 5,499 దరఖస్తులు వస్తే 6,079 దరఖాస్తులు పరిష్కరించింది. 2024లోని మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే 49 శాతం, 2023 తో పోలిస్తే 36 శాతం అధికమని తెలిపింది. భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వాటిలో 2,904 పరిష్కారం అవ్వగా, 98 శాతం అప్లికేషన్లను క్లియర్ చేసినట్టు అయింది. 2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయి. మొత్తం ఈ దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇచ్చారు.

Read Also- Diwali Troll War: ఏపీ పాలిటిక్స్‌లో దీపావళి చిచ్చు.. లేటెస్ట్‌గా ఏం జరుగుతుందో తెలుసా?

2025లో, హెచ్ఎండీఏ మొత్తం 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించిందని వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్‌బీ) అనుమతులు, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్, గృహాలతో లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని హెచ్ఏండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వాటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79 శాతం ఆమోద రేటును సాధించామన్నారు. 2024లో 3,209 కొత్త దరఖాస్తులలో 1,216 అనుమతులు ఇచ్చి 38 శాతం ఆమోద రేటు సాధించామని పేర్కొన్నారు. 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులను ఇవ్వడంలో 58 శాతం ఆమోద రేటు నమోదయ్యిందని ఆయన చెప్పారు. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతులు మంజూరు చేయడంలో గణనీయమైన వేగాన్ని సాధించామని తెలిపారు. నిర్మాణదారులకు, ప్రజలకు తమ సంస్థ ఒక నమ్మకాన్ని కలిగించడంతో వారిలో సానుకూల స్పందన వస్తోందని ఆయన చెప్పారు.

నిర్ధిష్ట కాలపరిమితిలో వివిధ భవనాలు, లేఔట్‌లు, లేఔట్ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కూడా హెచ్ఏండీఏ ఉన్నత ఫలితాలను సాధించిందని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. 2025 జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 6,079 ఫైళ్ళు పరిష్కారం అయ్యాయని, ఇది 2024తో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికమని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు హెచ్ఎండీఏ నిబద్ధతకు ప్రతిబింబమన్నారు. పౌరులు, నిర్మాణదారులు, పెట్టుబడిదారుల కోసం విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తోందని ఆయన తెలిపారు.

Read Also- H1B Visa Fee: హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో ట్రంప్ సర్కార్ ఊహించని గుడ్‌‌న్యూస్!

మొత్తం పెండింగ్ ఫైళ్లను ఒక నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం విభజించి వాటిని పరిశీలించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేశామని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, 30 నుంచి 60 రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్లు, 30 రోజుల లోపు పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళు, వారం రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళుగా మొత్తం ఫైళ్ళను విభజించుకుని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దరఖాస్తులు రావడం, వాటిని పరిష్కరించడం తమ పని విధానంలో చాలా ముఖ్యంగా భావిస్తున్నామని, అందుకే మంచి ఫలితాలు సాధించగలిగామని ఆయన వెల్లడించారు.

అనుమతులు, ఆదాయ పరంగా గత రెండు సంవత్సరాల్లో హెచ్ఎండీఏ ప్రగతి రెట్టింపు స్థాయికి చేరింది. పెరుగుతున్న డిమాండ్‌ను, హెచ్ఎండీఏ పారదర్శక విధానాలపై ప్రజల విశ్వాసాన్ని, అభివృద్ధి ప్రాజెక్టుల క్లియరెన్స్‌లో ఉన్న వేగాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఓపెన్ ప్లాట్‌లకు మంజూరైన లేఅవుట్ అనుమతులు 2,862 ఎకరాలను కవర్ చేశాయని అధికారులు తెలిపారు. 2024తో పోల్చితే ఇది 512 వృద్ధిగా ఉంది. హౌసింగ్‌తో కూడిన లేఅవుట్లు 38.24 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని చేరాయని, ఇది 2024తో పోల్చితే 186 శాతం వృద్ధి అని పేర్కొన్నారు. మరోవైపు, బిల్డింగ్ అనుమతుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల అభివృద్ధికి ఆమోదం లభించిందని, 2024తో పోల్చితే ఇది 239 శాతం, 2023తో పోల్చితే 87 శాతం పురోగతి అని నివేదిక పేర్కొంది. ఈ అసాధారణ ఆదాయ వనరులు హైదరాబాద్ నగర ప్రణాళికకు ప్రాణాధారంగా నిలుస్తోందని, రోడ్లు, ప్రజా సౌకర్యాలు, పచ్చదన ప్రదేశాలకు ఇది కొత్త శక్తినిస్తుందని హెచ్ఎండీఏ భావిస్తోంది. హెచ్ఎండీఏ వేగవంతమైన పురోగతి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దార్శనికత, ప్రోత్సాహకరమైన మద్దతు, అధికారుల అహర్నిశ శ్రమ ఉందని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. పారదర్శకత, బాధ్యత, నిబద్ధత ప్రతి అధికారిని అంచనాలకు మించి పనిచేయడానికి ప్రేరేపించిందన్నారు. ఈ విధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పురోగతికి మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!