PDS Rice Scam (imagecredit:swetcha)
హైదరాబాద్

PDS Rice Scam: కండ్లకోయలో భారీగా అక్రమ రేషన్ బియ్యం దందా.. వాటి విలువ ఎంతో తెలిస్తే షాక్..!

PDS Rice Scam: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆహారం కొరత లేకుండా ప్రతి నెల రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా అందిస్తోంది. కానీ కొందరు స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే కొంతమంది దళారులు పీడీఎస్(PDS) బియ్యం అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి తమ లాభాలను దండుకుంటున్నారు. గతంలో రేషన్ బియ్యం దందా కొందరు రేషన్ డీలర్ల కనుసైగల్లోనే నడిచేదనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ దందా అంతా రాజకీయ నాయకుల అండదండలతో కొంతమంది దళారులు ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.

సంగారెడ్డి జిల్లాలు కేరాఫ్ అడ్రస్‌గా..

ఈ రేషన్ దందా మేడ్చల్ మల్కాజిగిరి(Medchal Malkajgiri), జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి, సరిహద్దులలో ఉన్న గ్రామాల నుంచి గుజరాత్(Gujarath), మహారాష్ట్ర(Maharashtra), కర్ణాటక(Karnataka) రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ అక్రమ రేషన్ బియ్యం జోరుగా తరలింపు జరుగుతుందని అధికారులకు తెలిసిన చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్నారంటే ఏదో మతలబ్ ఉందని పలువురు అనుకుంటున్నా కూడా ప్రస్తుతం దందా అంతా హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి(rangareddy), మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి(sangareddy) జిల్లాలు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సంబంధిత అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Also Read: Sivaji: దీపావళి పటాసులతో వచ్చేసిన పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్.. ఫస్ట్ లుక్ అదుర్స్!

దందా ఇలా..

ప్రభుత్వం ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారుల ద్వారా ప్రతినెలా పంపిణీ చేస్తారు. అయితే సివిల్ సప్లై అధికారులు ఆ రేషన్ షాపుల కార్డులను బట్టి ఏ షాపునకు ఎంత రేషన్ బియ్యం అందించాలో ఆ షాపులకు గోదాంలో కాంట వేసి లారీల ద్వారా డీలర్లకు అందజేస్తారు. అయితే ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ ఉన్న కార్డుదారులకు డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్ బియ్యాన్ని కార్డు ఉన్న వాళ్లంతా రేషన్ బియ్యం తీసుకోకపోవడం, అలాగే రేషన్ బియ్యం తినలేనివారు ఆ బియ్యాన్ని డీలర్లకు లేదా ఇంటింటికి వచ్చి బియ్యం తీసుకెళ్లే వారికి కేజీకి రూ.8 నుంచి రూ.10కు విక్రయిస్తారు. అయితే డీలర్లకు ప్రతినెలా ఎంత కోటా సరిపోతుందో ముందస్తుగానే గుర్తించడంతో ఆ మిగులు బియ్యాన్ని రేషన్ షాపులకు రాకుండానే డీలర్లు గోదాం వద్ద ఉన్న అధికారులను మెయింటైన్ చేసి అక్కడే నిల్వచేసి లారీల ద్వారా రాత్రివేళల్లో ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

వాహనాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..!?

ప్రతిరోజు రాత్రి సమయాలలో బియ్యం లోడుతో వెళ్తున్న ఆటోలు, బొలెరో వాహనాలపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రేషన్ బియ్యం దందాలో అధికారుల హస్తం ఏమైనా ఉందా అని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పట్టుబడిన 35 టన్నుల రేషన్ బియ్యం

అక్రమంగా రేషన్ బియ్యం రవాణ చేస్తున్న ఇర్ఫాన్(Irrfan) అనే వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ టోల్ గేట్ వద్ద జీజే 36 వి 8886 అనే నంబర్ గల లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న 35 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని గుజరాత్(Gujarath) రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సీజ్ చేసి మేడ్చల్ లాండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తాం: జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి

అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్వేచ్ఛ ప్రతినిధితో మాట్లాడుతూ పట్టుబడిన రేషన్ బియ్యం సీజ్ చేసి ఈసీ యాక్ట్ 1950 ప్రకారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని అన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఏమైనా సమాచారం ఉంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు.

Also Reasd; Tollywood: మూడేళ్ళ నుంచి ఒక్క హిట్ లేదు.. ఆ నలుగురు హీరోల పని ఇక ఐపోయినట్టేనా?

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?