Tollywood: ఆ హీరోలు గుడ్ బై చెప్తారా?
Tollywood ( Image Souce: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Tollywood: మూడేళ్ళ నుంచి ఒక్క హిట్ లేదు.. ఆ నలుగురు హీరోల పని ఇక ఐపోయినట్టేనా?

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు హిట్స్ లేక అల్లాడిపోతున్నారు. ఒక్క హిట్ పడితే చాలు అని టెంపుల్స్ కి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టార్ హీరోల కొడుకులు కూడా ఎంటర్ అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ , స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు హీరో నితిన్ , శర్వానంద్, అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ ఉన్నారు.

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా అక్కినేని చిన్న హీరో అఖిల్ కు ఒక్క సరైన హిట్ పడలేదు. ఇప్పటికీ ట్రోల్స్ చేస్తూనే ఉన్నాడు. అన్న అక్కినేని నాగ చైతన్య ఆ సెంటిమెంట్ నుంచి బయట పడ్డాడు. అక్కినేని నాగార్జున ఖాతాలో కూడా హిట్స్ పడ్డాయి. అక్కినేని అఖిల్ కి హిట్ ఎప్పుడు పడాలి? తన అభిమానులకు ఇంకెప్పుడు విజిల్స్ వేయాలి. సినీ వర్గాలలో కొందరు అఖిల్ పని అయి పోయిందిల్ అని అంటున్నారు.

నాగశౌర్య, విశ్వక్ సేన్, సందీప్ కిషన్.. ఈ యంగ్ టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు తమ సినిమాలతో దూసుకెళ్లారు, కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ‘ఛలో’ సినిమాతో హిట్ కొట్టిన నాగశౌర్య, ఆ తర్వాత కూడా వరుస రెండు మూడు హిట్లు కొట్టి సత్తా చాటాడు. కానీ ఇప్పుడు మొత్తానికే సైలెంట్ అయిపోయాడు. కొద్దీ రోజుల్లో బ్యాడ్ బాయ్ కార్తీక్ తో మన ముందుకొస్తున్నాడు. దాదాపు రెండేళ్లు అవుతుంది
స్క్రీన్ మీద కనిపించడం లేదు.

అటు విశ్వక్ సేన్ కూడా వరుస హిట్లతో ఓ ఊపు ఊపినా, ఇప్పుడు ఆ జోష్ ఎక్కడో తగ్గినట్లు కనిపిస్తోంది. హడావిడి చేసిన ఈ హీరో ఇప్పుడు బ్రేక్ వేశాడు. మరోవైపు సందీప్ కిషన్ కథ కూడా అంతే. వరుస పరాజయాలు వెంటాడుతున్నా, ఈ యంగ్ హీరో మాత్రం పట్టుదలగా ముందుకు సాగుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ, సక్సెస్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ మాత్రం దొరకడం లేదు. ఇలా ఈ యంగ్ హీరోలు, ఒకప్పుడు స్టార్‌డమ్ దిశగా దూసుకెళ్లినవారు, ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూపులతో ఉన్నారు. వీళ్ల రీఎంట్రీ ఎప్పుడు, ఎలా ఉంటుందో, టాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?