Hyderabad Electricity (imagecredit:swetcha)
హైదరాబాద్

Hyderabad Electricity: మీరు కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్!

Hyderabad Electricity: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(SPDCL) చర్యలు చేపట్టింది. నగరంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ల అమరిక విధానంలో సంస్థ అధికారులు వినూత్న మార్పులు చేపట్టారు. ఇప్పటివరకు ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు రహదారుల పక్కన నేలమట్టానికి సమీపంగా అమర్చబడి ఉండేవి. ఈ పద్ధతి వల్ల పాదచారులకు అసౌకర్యం కలగడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్(Transformer) చుట్టుపక్కల చెత్త(Dust), ప్లాస్టిక్(Plastic) వ్యర్థాల వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

కొత్త సాంకేతిక పద్ధతి.. 

కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్‌, విద్యుత్ లీకేజీలు కూడా చోటుచేసుకుని ప్రమాదాలు సంభవించిన దాఖలాలు సైతం ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్(Pole Mounted Distribution Transformer) అనే కొత్త సాంకేతిక పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నూతన పద్ధతిలో విద్యుత్ స్తంభానికి దాదాపు 10 అడుగుల ఎత్తులో ఇనుప స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దానిపై ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చుతారు. ఈ విధానం వల్ల ట్రాన్స్‌ఫార్మర్ నేలమట్టానికి దూరంగా ఉండటంతో పాదచారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగదని అధికారులు చెబుతున్నారు.

Also Reada: Telangana BJP: బీజేపీ కార్యాలయంలో.. బీసీ సంఘం నేతల మధ్య ఘర్షణ

కాంక్రీట్ ఫౌండేషన్.. 

అదేవిధంగా, ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెత్త లేదా ఇతర వ్యర్థ పదార్థాలు చేరకుండా ఉండడం వలన భద్రతా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అంతేకాక ఈ విధానం ట్రాన్స్‌ఫార్మర్ స్ట్రక్చర్ ఖర్చును కూడా తగ్గించనుంది. ఎందుకంటే పెద్దస్థాయి కాంక్రీట్ ఫౌండేషన్ దీనికి ఏమాత్రం అవసరం ఉండదు. ఇదిలాఉండగా అంబర్ పేట(Amberpet Polce) పోలీస్ లైన్ లో ఏర్పాటుచేసిన పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ నమూనాను సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) గురువారం పరిశీలించారు. నూతనంగా ఏర్పాటుచేసే ట్రాన్స్ ఫార్మర్లకు ఈ పద్ధతినే వాడాలని సూచించారు. ఆయన వెంట డైరెక్టర్ నరసింహులు, చీఫ్ ఇంజినీర్ మెట్రో ప్రభాకర్(Metro Prabhakar), సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకన్న తదితరులు ఉన్నారు.

Also Read: Palamuru University: ఘనంగా పాలమూరు విశ్వవిద్యాలయ నాలుగోవ స్నాతకోత్సవం..

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్