Telangana BJP: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతలు ఘర్షణకు దిగారు. బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ( Ramchander Rao) రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎదుటే బాహాబాహీకి దిగారు. సత్యం, కృష్ణ అనే బీసీ సంఘం నేతలిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం చేయిచేసుకున్నారు. ఇరువురు నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈనెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.
Also Read: Telangana BJP: కమల దళపతి నియామకానికి చకచకా ఏర్పాట్లు
ఆర్ కృష్ణయ్య రంగంలోకి
కాగా ఈ బంద్ కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసేందుకు బీసీ సంఘం నేతలతో పాటు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వచ్చారు. కాగా ఫొటోలు దిగే అంశంపై ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ అయ్యి ఉండి ఫొటోలు దిగేందుకు ఎలా ముందుకు వెళ్తావంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఆ సమయంలో రాంచందర్ రావు, ఆర్ కృష్ణయ్య అక్కడే ఉండగా ఆర్ కృష్ణయ్య రంగంలోకి దిగి ఇరు వర్గాలను నచ్చజెప్పారు.
బీసీల వాదన వినకుండా కోర్టు స్టే
అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల వాదన వినకుండా కోర్టు స్టే ఇచ్చిందని ఆయన వివరించారు. చిన్న చిన్న అంశాలపై బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. జనాభా లెక్కల అనంతరం బీసీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు.
Also Read: BJP Somu Veerraju: మంత్రి పదవి నాకొద్దు!.. ఈ జీవితానికి ఎమ్మెల్సీ చాలు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!
