Pak vs Afghan War (Image Source: Twitter)
అంతర్జాతీయం

Pak vs Afghan War: పాక్-అఫ్గాన్ మధ్య ఎందుకు చెడింది.. ఘర్షణలకు కారణమేంటి.. దీని వెనుక భారత్ ఉందా?

Pak vs Afghan War: గత వారాంతంలో ఆఫ్గానిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం తర్వాత పాక్ – అఫ్గాన్ మధ్య జరిగిన అతి తీవ్రమైన ఘర్షణగా ఇది నిలించింది. 2021లో అఫ్గాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాక్ సరిహద్దు వెంబడి జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే కావడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దృష్టిని సైతం ఇది ఆకర్షించింది.

అసలేం జరిగింది?

శనివారం రాత్రి తాలిబాన్ దళాలు.. 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడి చేశాయి. అనంతరం పాకిస్థాన్ దళాలు ప్రతిదాడి ప్రారంభించాయి. తుపాకులు, ఆర్టిలరీలు, డ్రోన్ల దాడులతో ఆదివారం ఉదయం వరకు ఇరు బలగాలు విరుచుకుపడ్డాయి. అయితే తెల్లారిన తర్వాత ఈ కాల్పులు ఆగిపోగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆదివారం కూడా కొనసాగాయి. ఈ కాల్పుల ఘటనలో 23 మంది సైనికులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అటు తాలిబాన్ సైతం తొమ్మిది మంది యోధులను కోల్పోయినట్లు పేర్కొంది.

ఘర్షణకు కారణమేంటి?

గత వారం పాకిస్తాన్ వైమానిక దళం.. ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ తాలిబాన్ (Tehrik-i-Taliban Pakistan – TTP) నేతను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. అతను బతికున్నాడో లేదో స్పష్టంగా తెలియలేదని తెలియజేశాయి. అయితే తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను చాలా సీరియస్ గా తీసుకుంది. తమ దేశంపై జరిగిన వైమానిక దాడిగా అభివర్ణించింది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి.. భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. దీంతో ఆయన భారత్ వేదికగానే పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు ప్రతిస్పందనగానే శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంబడి అఫ్గాన్ బలగాలు కాల్పులకు తెకబడ్డాయి.

పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ప్రస్థానం?

వాయవ్య పాకిస్తాన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పశ్తూన్ జాతికి చెందిన జిహాదీ గ్రూపులు అన్ని కలిసి 2007లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశాయి. దీనిని పాకిస్థాన్ తాలిబన్ గా పిలవబడుతోంది. ఇది అఫ్గాన్ లోని తాలిబన్ల నుంచి ప్రేరణ పొందినప్పటికీ సిద్దాంతాల పరంగా అల్ ఖైదాను ఈ సంస్థ అనుసరించింది. పాకిస్థాన్ తాలిబన్.. కాలక్రమేణ మార్కెట్లు, మసీదులు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, పోలీసు స్టేషన్లపై దాడులు చేస్తూ వచ్చింది. తద్వారా సరిహద్దు ప్రాంతాలతో పాటు పాకిస్థాన్ అంతర్గత భూభాగంలోనూ దాడులకు తెగబడింది. 2014లో పేషావర్ లోని ఒక పాఠశాలపై దాడి చేసి.. 130 మందికి పైగా పిల్లలను టీటీపీ పొట్టన పెట్టుకుంది. దీంతో అప్పట్లో పాక్ భారీ ఎత్తున సైనిక ఆపరేషన్ చేపట్టింది. దీంతో టీటీపీ ఉగ్రవాదులు… పాక్ విడిచి పారిపోయారు. అయితే వీరికి అఫ్గాన్ తాలిబన్లు అండగా నిలుస్తూ.. పాక్ లో అశాంతిని ఎగదోస్తున్నారని దయాది దేశం ఆరోపిస్తోంది.

తాలిబన్ అధికారంలోకి వచ్చిన తర్వాత..

2021లో తాలిబాన్ ఆఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్థాన్ సంతోషంగా స్వాగతించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ‘ఆఫ్గాన్లు బానిసత్వపు గొలుసులను తెంచుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. అయితే తాలిబాన్ల పాలన పాకిస్థాన్ ఆశించినట్లు సాగలేదు. దీంతో పాక్ లో టీటీపీ దాడులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయాయి. తమ దేశంలో దాడికి వ్యూహరచన చేస్తున్న టీటీపీ నాయకత్వం, కీలక సభ్యులు అఫ్గాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పాక్ ఆరోపిస్తోంది. వారిని నియంత్రించాలని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ సూచిస్తోంది. అయితే కాబూల్ లో టీటీపీ ఉనికే లేదని తాలిబన్ సర్కార్ చెబుతోంది.

భారత్‌పై పాక్ ఆరోపణలు..

అఫ్గానిస్తాన్ తో కలిసి టీటీపీ, ఇతర మిలిటెంట్ గ్రూపులను పాకిస్థాన్ పైకి భారత్ ఎగదోస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పాక్ ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి.. భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ – అఫ్గాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరుదేశాలు మరింత దగ్గరవుతున్న క్రమంలో పాకిస్థాన్ లో కొత్త భయాలు పురుడుపోసుకుంటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఓటమి ఖాయం.. నా గతే నీకూ పడుతుంది.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్

ట్రంప్ ఏమన్నారంటే?

పాక్ – అఫ్గాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను’ అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యం పర్యటనలో ఉన్న ఆయన.. తిరిగి అమెరికాకు వెళ్లిన తర్వాత దాని గురించి చూస్తానని చెప్పారు. ‘మీకు తెలుసా.. నేను మరో యుద్ధాన్ని కూడా పరిష్కరించబోతున్నాను. ఎందుకంటే యుద్ధాలు పరిష్కరించడంలో నేను బాగా నేర్పరి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read: Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే.. ఓటు చోరీ డ్రామాలు ఆడుతున్నాయ్.. మంత్రి పొన్నం మండిపాటు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!