MBBS Seats( image credit: twitter)
హైదరాబాద్

MBBS Seats: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లు?

MBBS Seats: రాష్ట్రంలో ఈ ఏడాది మరో 175 ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) పెరిగాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నెల క్రితం కొడంగల్ మెడికల్ కాలేజీకి 50 సీట్లు, ఈఎస్ఐసీకి 25 సీట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన ఎన్ఎంసీ, తాజగా మరో వంద సీట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. నోవా మెడికల్ కాలేజీకి 50 సీట్లు, మహావీర్ మెడికల్ కాలేజీకి మరో 50 సీట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Also Read: TG Gurukula Schools: 5 రోజులుగా సమ్మె లో కాంట్రాక్టర్లు!.. గురుకులాల్లో వంటకు తప్పని తిప్పలు

మొత్తంగా ఈ ఏడాది ఎన్ఎంసీ ఈ ఏడాది 175 ఎంబీబీఎస్ సీట్లు

దీంతో నోవా, మహావీర్ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం 150 మెడికల్ సీట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 200 లకు చేరనుంది. మొత్తంగా ఈ ఏడాది ఎన్ఎంసీ ఈ ఏడాది 175 ఎంబీబీఎస్ సీట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లయింది. దీంతో రాష్ట్రంలో ని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4265 మెడికల్ సీట్లు ఉండగా, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4200 సీట్లకు పెరిగాయి. కొడంగల్ మెడికల్ కాలేజీలో 50, ఈఎస్ఐసీలో 25, నోవా మెడికల్ కాలేజీలో 50, మహవీర్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వడంత మెడికల్ కాలేజీల సంఖ్య 65 కు చేరి, సీట్ల సంఖ్య 8640కు చేరింది. దీని వలన ఎంబీబీఎస్ విద్యార్ధుల సంఖ్య మరింత పెరగనున్నది.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ పనుల్లో అలసత్వానికి చెక్.. పనుల వేగం కోసం డ్యాష్ బోర్డు ఏర్పాటు

పర్యాటక రంగం అభివృద్ధి సురక్షితమైన వాతావరణం కీలకం.. టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి

రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు. పర్యాటకులకు ఆతిథ్యానికి సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మాదాపూర్‌లోని నిథమ్‌ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన టూరిస్ట్ పోలీసుల ‘ఓరియంటేషన్ సెన్సిటైజేషన్’ శిక్షణ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. మూడ్రోజులపాటు పర్యాటక భద్రత, ఆతిథ్యం అందించే నైపుణ్యాలపై, అదే విధంగా సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌, క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌, సాంస్కృతిక అవగాహన, పర్యాటక సౌకర్యం, భద్రతా చర్యలు వంటి కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు.

టూరిస్ట్ పోలీసులకు క్షేత్రస్థాయి పర్యటన

ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ మరో మూడు రోజులపాటు టూరిస్ట్ పోలీసులకు క్షేత్రస్థాయి పర్యటనలో వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే సురక్షితమైన వాతావరణం, భద్రత కీలకమన్నారు. రిస్క్ మేనేజ్‌మెంట్, సర్వైలెన్స్ సిస్టమ్స్‌పై దృష్టి సారించాలని, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసులు సందర్శకులకు భరోసా కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అడవి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌లలో భద్రతను పటిష్టం చేయడానికి, టూరిస్ట్ స్టే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Also Read: Government Land: రూ.6 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ.. కబ్జాదారులకు రెవెన్యూ షాక్

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..