GHMC (Image Source: Twitter)
హైదరాబాద్

GHMC: హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం.. నీరు సాఫీగా వెళ్లేందుకు.. జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్!

GHMC: ఇటీవల మహానగరంలో దంచి కొట్టిన వానలతో జీహెచ్ఎంసీ గుణపాఠాలు నేర్చుకుంది. కనీసం వచ్చే వర్షాకాలంలోనైనా వరద ముంపును తగ్గించుకునేందుకు సిద్దమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో పాటు శివారు ప్రాంతాల్లో వరద నీటి కాలువల నిర్వహణ, ఫ్లడ్ మేనేజ్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సిటీలోని వాటర్ డ్రెయిన్లను మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది.

ముంబయి తరహాలో..

బృహన్ ముంబై, గుర్గావ్, భోపాల్ నగరాల్లో మాదిరిగా ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను సిటీలో కూడా అమలు చేయాలని జీహెచ్ ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వరకు విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున తెలంగాణ కోర్ ఆర్బన్ రీజియన్ పరిధిలోని వాటర్ డ్రెయిన్స్ అన్నింటిని మ్యాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ జోన్ పరిధిలోని కార్వాన్ ప్రాంతంలోని వాటర్ డ్రెయిన్లను ఇప్పటి వరకు 25 వేల 837 మీటర్ల పొడువున మ్యాపింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

1300 పొడవునా ప్రవహిస్తున్న నాలాలు

ముఖ్యంగా వరద నీటి కాలువల గుర్తింపు, వర్షపు నీరు ఇంకే మార్గాలు, మూసీలో కలిసే మార్గాలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాటర్ డ్రెయిన్ లెక్క తేల్చాలని నిర్ణయించారు. అధికారుల వద్దనున్న సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు సుమారు 1300 కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తున్నట్లు గతంలో గుర్తించారు. కానీ ప్రస్తుతం చిన్న పాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావటంతో చాలా ప్రాంతాల్లో కబ్జాల కారణంగా నాలాలు బాగా కుదించుకుపోయినట్లు గుర్తించారు. ఖైరతాబాద్ సర్కిల్స్ పరిధిలో ఫ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా గ్రేటర్ లోని అన్ని సర్కిల్స్ లోని నాలాలను మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు. గ్రౌండ్ లెవల్ సర్వేతోపాటు డ్రోన్లతో కూడా సర్వే చేయనున్నారు.

మొబైల్ ఫీల్డ్ వర్కర్ టైప్ తో సర్వే

జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలు, వరదనీటి కాలువలు, చెరువులు, ఇతర యుటిలిటీస్ గుర్తించడానికి ఆర్క్ జీఐఎస్ లో భాగంగా ‘మొబైల్ ఫీల్డ్ వర్కర్ టైప్’ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. ఈ సాప్ట్ వేర్ ను ఇస్రీ (ఇండియా టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ) సమకూర్చనుంది. అయితే వార్డుకో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఏఈఈ) ద్వారా ఈ సర్వే చేయించాలని నిర్ణయించారు. ఏ వార్డులో ఫ్లడ్ మేనేజ్ మెంట్ కు అవసరమైన మార్గాలున్నాయి, వరద నీటి కాలువలు, నాలాల ఎన్ని ఉన్నాయి? గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఏమైనా ఉందా? అనే కోణంలో సర్వే చేయనున్నారు. అలాగే ఈ వరద నీటిని మూసీలో కలపడానికి ఏమైనా అవకాశం ఉందా? అనే అంశాలపై కూడా సాధ్యాసాధ్యాలపై సర్వే చేయనున్నారు.

Also Read: CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు

యూనిక్ నెంబర్ కేటాయింపు

ఈ సర్వే అనంతరం వర్షాలు పడిన సయయంలో ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండ బోతుందనేది ముందుగానే ఇటు అధికారులకు, అటు ప్రజలకు తెలిసేలా బల్దియా ప్లాన్ చేస్తుంది. సర్వేలో ఎన్ని సర్టమ్ వాటర్ డ్రెయిన్లు ఉన్నాయన్న విషయంపైన క్లారిటీ వస్తే గానీ వరద నివారణ చర్యలను అంచనా వేయలేమని అధికారులంటున్నారు. ఒక్కో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ మ్యాన్ హోల్స్ మూతలకి ఒక యూనిక్ నెంబర్ జారీ చేయనున్నారు. యూనిక్ నెంబర్ల ఆధారంగా అధికారులు పర్యవేక్షించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ఈ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Harish Rao: ఆరు గ్యారంటీల లెక్క.. బీసీ రిజర్వేషన్లు ఓ డ్రామా.. హరీశ్ రావు ఫైర్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?