Skin Care: అలాంటి సబ్బులు డేంజర్ అని తెలుసా?
soap ( Image Source: Twitter)
Viral News

Skin Care: మనం రోజూ వాడే సబ్బులు మంచివి కావా?

Skin Care: ఉదయాన్నే మన దినచర్య స్నానంతో మొదలవుతుంది. ఈ సమయంలో సబ్బు మన చర్మాన్ని మంచిగా చేస్తుంది. సబ్బు కేవలం మురికిని, చెమటను తొలగించడమే కాకుండా, చర్మాన్ని తాజాగా ఉంచడంలో పాత్ర పోషిస్తుంది. అయితే, మార్కెట్‌లో రంగురంగుల, సుగంధభరితమైన సబ్బుల మధ్య మన చర్మానికి ఏది సరైనదో ఎలా ఎంచుకోవాలి? సబ్బులో ఉండే  ఎలాంటివి ఉంటాయో ముందే  తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Navi Mumbai Airport: దేశంలో తొలి డిజిటల్ ఎయిర్ పోర్ట్.. నిర్మాణానికి రూ.19,650 కోట్లు ఖర్చు.. ప్రత్యేకతలు ఇవే!

సబ్బు అనేది కేవలం శుభ్రపరిచే వస్తువు మాత్రమే కాదు, ఇది మన చర్మ సంరక్షణలో అనివార్యమైన అంశం కూడా.  క్రీ.పూ. 2800లో బాబిలోనియన్లు జంతు కొవ్వు, చెక్క బూడిదతో కొత్తగా తయారు చేసి, ఎక్కువగా బట్టలు ఉతకడానికి ఉపయోగించారు. క్రీ.పూ. 1500 నాటికి ఈజిప్షియన్లు నూనెలు, లవణాలతో సబ్బును చర్మ సంరక్షణ కోసం మెరుగుపరిచారు. తర్వాత యూరోపియన్లు ఆలివ్ నూనెతో సుగంధ సబ్బులను తయారు చేశారు.

Also Read: Water Bottles: ఏంటి.. వాటర్ బాటిల్ మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? బయట పడ్డ నమ్మలేని నిజాలు

అయితే, నీటితో కలిసినప్పుడు ఎక్కువగా నురగలు వచ్చే సబ్బులు చర్మానికి హాని కలిగించే రసాయనాలను నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, సోడియం లారెల్ సల్ఫేట్ వంటి రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను తొలగించి, పొడిబారడం లేదా చికాకును కలిగిస్తాయి. పారాబెన్స్, థైలాయిడ్స్ వంటి పదార్థాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అలాగే, ట్రైక్లోసాన్ అనే రసాయనం బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కానీ, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి, సబ్బు కొనే ముందు దానిలోని ఉండే వాటిని ముందుగానే పరిశీలించాలి. మన చర్మానికి, ఆరోగ్యానికి హాని కలిగించని సబ్బులను ఎంచుకోవడం ముఖ్యం. కొబ్బరి నూనె, షియా బట్టర్, అలోవెరా, తేనె వంటి సహజ పదార్థాలతో తయారైన సబ్బులు చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేస్తాయని నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

Also Read: Physics Nobel: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ అవార్డ్.. 1985లో ప్రయోగం.. నేడు విప్లవాత్మక మార్పులు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క