water bottle ( Image Source: Twitter)
Viral

Water Bottles: ఏంటి.. వాటర్ బాటిల్ మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? బయట పడ్డ నమ్మలేని నిజాలు

Water Bottles: మనం సాధారణంగా ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్ ను తీసుకెళ్తుంటాము. ఇంక ఇంట్లో, ఆఫీసు డెస్క్‌పై, జిమ్ బ్యాగ్‌లో లేదా కారులో.. ఇలా ఎక్కడ చూసినా మనతో పాటు వాటర్ బాటిల్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. మనం తినకపోయినా ఉండగలుగుతాము. కానీ, మంచి నీళ్లు తాగకుండా అసలు ఉండలేము. ఎందుకంటే, బండి తిరగడానికి పెట్రల్ ఎంత ముఖ్యమో.. మనిషి తిరగడానికి నీళ్లు కూడా అంతే ముఖ్యం.

Also Read: DRDO Apprenticeship Recruitment: DRDO అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025.. 50 పోస్టులకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు

మన దాహాన్ని తీర్చే ఈ స్నేహితుడు, మన ప్రాణం నిలబెడుతుంది. నీళ్లు బాటిల్ లో అయిపోవగానే మళ్ళీ వెంటనే నింపేస్తాం. కొద్దిగా మిగిలిన నీరును కడిగేసి కొత్త నీళ్లతో మళ్లీ రీఫిల్ చేస్తాం. కానీ, ఇలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ బాటిల్‌ను మీరు ఎప్పుడైనా శుభ్రం చేశారా? బయట నుండి మెరిసిపోతున్న ఆ బాటిల్ లోపల కంటికి కనిపించని ఒక సూక్ష్మక్రిములు ఉన్నాయని తెలుసా? అది మన ఆరోగ్యానికి పెద్ద ముప్పు అని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది.

Also Read: Heavy Traffic Jam: దేశంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా రోడ్లపైనే వాహనదారులు.. మ్యాటర్ ఏంటంటే?

ఎందుకు ఇంత ప్రమాదం?

మనం రోజూ ఒకటే వాటర్ బాటిల్ ను వాడుతుంటాము. అయితే, ఒకటి కాకుండా రెండు వాడాలని చెబుతున్నారు. ఎందుకంటే, ఒకటే బాటిల్‌ను కడగకుండా వాడటం వల్ల అది సూక్ష్మక్రిములు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు తాగేటప్పుడు బాటిల్‌కు నోరు ఆనించడం వల్ల మన లాలాజలం, నోటిలోని సూక్ష్మక్రిములు, తిన్న ఆహార పదార్థలు బాటిల్ లోపలికి చేరతాయి. బాటిల్‌లోని తేమ, వెచ్చదనం బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములు విచ్చలవిడిగా పెరుగుతాయి.

Also Read: Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?