Crime News ( image CREDIT: SWETCHA REPORTER)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?

Crime News: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన భార్యను (Crime News) కోత కత్తితో విచక్షణా రహితంగా, సభ్య సమాజం తలదించుకునేలా అతి దారుణంగా హతమార్చాడు. ఈ విషయం సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem ) జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం ముత్యాలమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ధారావత్ గోపి సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, ఈ దంపతులు కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

 Also ReadKomati Reddy Venkat Reddy: విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోత కత్తితో భార్య సునీతను విచక్షణారహితంగా దాడి

యితే నిత్యం మద్యానికి బానిసైన గోపి భార్య సునీత వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించేవాడు. ఈ క్రమంలో తరచు భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రోజువారి పనులకు వెళ్లే సునీతను నమ్మించి తనతోపాటు గోపి సైతం వ్యవసాయ పనులకు వెళ్ళాడు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాక ఇద్దరి నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో గోపి తనతో పాటు తెచ్చుకున్న కోత కత్తితో భార్య సునీతను విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు.

సాయంత్రం అయిన ఇంటికి రాకపోయేసరికి

ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇరువురు సాయంత్రం అయినప్పటికీ ఇంటికి రాకపోయేసరికి ఇద్దరు కుమార్తెలు తల్లడిల్లిపోయారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. దీంతో గోపి.. సునీతలను వెతుక్కుంటూ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. కాగా, వ్యవసాయ క్షేత్రంలో రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి పడి ఉన్న సునితను చూసి బోరున విలపించారు. వెంటనే జరిగిన విషయాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

ఘటన స్థలానికి పోలీసులు

సునీతను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

గోపి పురుగుల మందు తాగి ఆత్మహత్య

తన భార్యను అత్యంత దారుణంగా వివాహేతర సంబంధం ఉందనే నేపథ్యంలో హతమార్చిన గోపి తను కూడా మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించాడు. మంగళవారం మధ్యాహ్నం గోపి సైతం మృతి చెందాడు.

అనాధలుగా మారిన కూతుళ్లు

వివాహేతర సంబంధం అనే అనుమానం ఆ పచ్చటి కుటుంబంలో యమపాశమైంది. భర్త చేతిలో భార్య మృతి చెందగా, భార్యను చంపానని మనస్థాపనతో భర్త గోపి సైతం పురుగుమందు జీవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు కూతుళ్లు అనాధలుగా మిగిలిపోయారు. కాగా, గోపి, సునీత మృతదేహాలను కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.

Also Read: OG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..