OG Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓజీ’ (OG – They Call Him OG) బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 308 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా.. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ కలెక్షన్స్‌తో ‘ఓజీ’ 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లతో నిర్మాతలే కాదు, ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఇలాంటి సినిమా కోసం, ఇలాంటి కలెక్షన్ల సునామీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు ఈ సినిమా తెరదించింది.
Also Read- Bad Boy Karthik Teaser: ‘బ్యాడ్ బాయ్’ కాదు.. అసలు మ్యాచ్ ఇప్పుడే మొదలైంది
రిలీజ్‌కు ముందే బీభత్సమైన హైప్
‘ఓజీ’ సినిమా విడుదలకు ముందు నుంచి బీభత్సమైన హైప్‌ని రాబట్టుకుంది. ఈ హైప్ ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 154 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత కూడా దసరా సెలవుల అడ్వాంటేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని స్టడీగా వసూళ్లను సాధించింది. కేవలం 4 రోజుల్లోనే రూ. 252 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం… ఇప్పుడు 11 రోజుల్లో రూ. 308 కోట్ల మైలురాయిని చేరుకుంది. ముఖ్యంగా ఏపీలో సోమవారం నుంచి టికెట్ల ధరలు తగ్గడంలో, మళ్లీ కలెక్షన్స్ పుంజుకున్నట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సినిమాకు పెంచిన ధరలకు భయపడి, సినిమా చూడలేదు. ఎప్పుడైతే టికెట్ల ధరలు నార్మల్ అయ్యాయో.. చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతుండటం విశేషం. ఈ పని మేకర్స్ ముందే చేసుంటే, కలెక్షన్స్ విషయంలో దుమ్మురేగిపోయేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read- OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?
రికార్డుల విధ్వంసం
‘ఓజీ’ సినిమా వసూళ్లు పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. రూ. 200 కోట్ల, రూ. 250 కోట్ల గ్రాస్ మార్కులను వేగంగా దాటిన పవన్ తొలి చిత్రంగా ‘ఓజీ’ నిలిచింది. అంతేకాదు, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై రూ. 303 కోట్లు వసూలు చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డును అధిగమించి, 2025లో హయ్యెస్ట్ గ్రాసర్ (అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం)గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నిలిచింది. సుజీత్ సంభవాన్ని ఫ్యాన్స్ పొగడకుండా ఉండలేకపోతున్నారు. ముంబై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథాంశం, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, ఆయన నటనలో చూపిన కొత్త కోణం, దర్శకుడు సుజీత్ (Director Sujeeth) టేకింగ్, ఎస్. థమన్ (S Thaman) అందించిన పవర్ ప్యాక్డ్ మ్యూజిక్, బీజీఎం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ అసాధారణ వసూళ్ల ప్రదర్శనతో ‘ఓజీ’ తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిందనడంలో సందేహం లేదు.
No rules.⁰No laws.⁰Only Gambheera’s law.
And he’s the ORIGINAL GANGSTER 🔥#TheyCallHimOG 11 Days Worldwide Gross 308 Cr+ 💥
⁰The Highest Grossing Telugu Film of 2025 ❤️🔥#OG #BoxOfficeDestructorOG pic.twitter.com/gJvhKdtrf0— DVV Entertainment (@DVVMovies) October 6, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
