Bad Boy Karthik Teaser: యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik) టీజర్ విడుదలై, మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని ఇటీవల మేకర్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను డబుల్ చేసేలా ఇప్పుడొచ్చిన టీజర్ ఉందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
Also Read- Tribanadhari Barbarik OTT: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడంటే?
బ్యాడ్ బాయ్ కాదు స్మార్ట్ బాయ్
టీజర్‌ని గమనిస్తే.. ఒక నిమిషం 21 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో.. సినిమా కథా నేపథ్యాన్ని సూచించే అంశాలను దర్శకుడు సమర్థవంతంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో కనిపించే నాగశౌర్య మాస్ స్వాగ్, ఆ తర్వాత వచ్చే కొన్ని పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయని చెప్పుకోవాలి. ఈ టీజర్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డైలాగ్స్. ఈ టీజర్‌లోనే రెండు మూడు డైలాగ్స్‌ని మేకర్స్ పరిచయం చేశారు. అవన్నీ కూడా పేలాయి. ‘నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు.. కానీ స్మార్ట్ బాయ్‌లా ఉన్నావ్’ అని విలన్ చెప్పే డైలాగ్ చూస్తే.. ఇందులో నాగశౌర్య పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ‘అసలు మ్యాచ్ ఇప్పుడే మొదలైంది’ అనే హీరో డైలాగ్… హీరో కేవలం అల్లరి చిల్లరగా ఉండే యువకుడి పాత్ర కాదని, తన జీవితంలో ఒక బలమైన లక్ష్యం ఉందనేది స్పష్టమవుతోంది. సినిమాలోని మెయిన్ పాత్రలను పరిచయం చేస్తూనే, టీజర్‌ని అద్భుతంగా కట్ చేశారు.
Also Read- 80s Stars Reunion: 80స్ స్టార్స్ రీయూనియన్ పార్టీలో ఉన్న సెలబ్రిటీలు వీరే..
బలమైన ఎమోషనల్ పాయింట్
మరోవైపు సాంకేతికంగా కూడా ఈ సినిమా హై లెవల్‌లో ఉంది. హారీష్ జైరాజ్ సంగీతం ఈ టీజర్‌కు ప్రాణం పోసింది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ.. సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు రామ్ దేశినా (Ramesh).. నాగశౌర్యను మునుపెన్నడూ చూడని యాంగిల్‌లో ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ కేవలం లవ్ స్టోరీనో, లేదంటే యాక్షన్ ఫిల్మ్ అని కాకుండా, ఒక బలమైన ఎమోషనల్ పాయింట్‌తో కూడిన కమర్షియల్ కథ అని ఈ టీజర్ తెలియజేస్తుంది. విడుదలకు ముందే ఈ టీజర్ సినిమాపై హైప్‌ను సృష్టించగా, ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
