80s Stars Reunion
ఎంటర్‌టైన్మెంట్

80s Stars Reunion: 80స్ స్టార్స్ రీయూనియన్‌ పార్టీలో ఉన్న సెలబ్రిటీలు వీరే..

80s Stars Reunion: దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో వేడుకగా జరిగే ‘80s Stars Reunion’ 4 అక్టోబర్‌, 2025న చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ వేడుక, సెలబ్రిటీలందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్‌గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ముందుగా ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కలిసి వెళుతున్న ఫొటో ఒకటి బయటకు రాగానే, ఈ వేడుకపై అందరూ ఆసక్తి కనబరిచారు. వారిద్దరూ సెపరేట్‌గా ఒక ఫ్లైట్‌లో ఈ రీయూనియన్‌కు వెళుతుండటంతో.. ఫొటో వైరల్ అవడమే కాకుండా.. ఈసారి ఈ బ్యాచ్ ఏ థీమ్‌తో కనిపించనున్నారనేది అందరిలో ఇంట్రస్ట్ పెంచేసింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవితో పాటు, పార్టీలో ఉన్న మరికొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వాటిని చూసిన వారంతా చాలా హ్యాపీగా ఫీలవుతూ.. ఇది ఐక్యతకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Mandaadi: సుహాస్ ‘మందాడి’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. భారీగా నష్టం!

పులి చారల డ్రస్ థీమ్‌

వాస్తవానికి ఈ వేడుక గతేడాదే నిర్వహించాల్సి ఉంది. కానీ, చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ రీయూనియన్‌ వేడుక వాయిదా పడింది. ఈసారి మాత్రం ఈ వేడుక స్నేహం, ఐక్యత, హృదయపూర్వకమైన సమావేశంగా విజయవంతంగా జరిగింది. రాజ్‌ కుమార్‌ సేతుపతి, శ్రీప్రియ దంపతులు తమ ఇంట్లోనే ఈ రీయూనియన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్‌, ఖుష్బూ సుందర్‌, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కో-అర్డినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంటి ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుక, సెలబ్రిటీల మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించింది. మొత్తం 31 మంది నటీనటులు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. పులి చారల డ్రస్ థీమ్‌తో జరిగిన ఈ వేడుకకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు హిందీ పరిశ్రమ నుంచి కూడా స్టార్స్ హాజరవడం విశేషం. సాయంత్రం అంతా నవ్వులు, జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకుంటూ ఎంతో ఆత్మీయంగా ఈ వేడుక గడిచినట్లుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

Also Read- Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

మొదటిసారి కలిసినట్టుగానే..

‘80s స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎంతో ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టుగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఈసారి ఇది ఉత్సవం కాదు’ అని సుహాసిని మణిరత్నం పోస్ట్ చేస్తే.. ‘ఇది సంవత్సరాలుగా పరిచయమైన స్నేహితుల కలయిక.. ఒకరికొకరు మద్దతుగా ఉండటానికి, కృతజ్ఞత తెలిపేందుకు’ అని లిస్సీ లక్ష్మి పోస్ట్ చేశారు. ఇలా ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరిగే ఈ ‘80s Stars Reunion’ స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోందని అంతా ముక్తకంఠంతో చెబుతుండటం విశేషం.

ఈ రీయూనియన్‌కి హాజరైన స్టార్స్ లిస్ట్ ఇదే:

1. చిరంజీవి, 2. వెంకటేష్, 3. జాకీ ష్రాఫ్, 4. శరత్‌కుమార్, 5. రాజ్‌కుమార్ సేతుపతి, 6. శ్రీప్రియ, 7. నదియా, 8. రాధ, 9. సుహాషిని, 10. రమ్య కృష్ణ, 11. జయసుధ, 12. సుమలత, 13. మీనా, 14. ఖుష్బూ, 15. భాగ్యరాజ్, 16. పూర్ణిమా భాగ్యరాజ్, 17. లిస్సీ, 18. నరేష్, 19. సురేష్, 20. శోభన, 21. మేనక, 22. రేవతి, 23. ప్రభు, 24. జయరామ్, 25. అశ్వతీ జయరామ్, 26. సరిత, 27. భాను చందర్, 28. రెహమాన్, 29. లత, 30. స్వప్న, 31. జయశ్రీ

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?