Komati Reddy Venkat Reddy (imagecredit:twitter)
తెలంగాణ

Komati Reddy Venkat Reddy: విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkat Reddy: రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎర్రమంజిల్ లో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dhanam Nagender), ఎమ్మెల్సీ రియాజుల్ హాసన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లతో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎర్రమంజిల్ లో కార్పొరేట్ స్థాయికి దీటుగా రూ. 7.7 కోట్లతో నూతన పాఠశాల నిర్మించి ప్రారంభించుకోవటం శుభపరిణామమని అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇంత గొప్ప పాఠశాలల ఎర్ర మంజిల్ లో అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) ప్రత్యేక శ్రద్ధ, అలాగే మెగా సంస్థ యాజమాన్యం కృష్ణారెడ్డి, నిర్వాహకుల్రే కారణమని మంత్రి అభినందించారు.

వైద్య భవనాల విస్తరణ

అదే విదంగా పాఠశాలలోని అన్ని గదులను ఏసీ క్లాస్ రూమ్స్ గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని, స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్ లుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, ఆ దిశగా పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా సిద్ధం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పేద పిల్లలు ఉన్నతమైన విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం ఒక లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Young India Integrated School)లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా దాదాపు రూ. 17.00 కోట్లతో నిమ్స్ ఆవరణలో వైద్య భవనాల విస్తరణ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు గాను ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షల కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: Cyber Crime: అత్యాశకు పోయారా? అంతే సంగతులు.. పంజా విసురుతున్న సైబర్ మోసగాళ్లు!

పాఠశాలలో ఉత్తీర్ణత శాతం..

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తున్నామని మంత్రి వివరించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించుకున్న పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ నిధుల నుండి రూ. 25 లక్షలు కేటాయించునున్నట్లు తెలిపారు. నూతన పాఠశాల కార్పొరేట్ స్థాయికి దీటుగా చేపట్టటంతో విద్యార్థులు పోటితత్వంతో చదివి ప్రతి ఒక్కరూ అత్యున్నత మార్కులు సాధించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే దిశ గా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, డిజిటల్ క్లాసుల ద్వారా మెరుగైన విద్యాబోధన అందిస్తున్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించటంతో పాటు అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి(Vijaya Reddy), డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి(Mothe Srilath Shoban Reddy), ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ లింగారెడ్డి(Linga Reddy), చీఫ్ ఇంజనీర్ బిల్డింగ్స్ రాజారెడ్డి, ఈ ఈ ఎలక్ట్రికల్ శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి ఆర్ రోహిణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ATA Dussehra Celebrations: అమెరికాలో అలరించిన ‘ఆట’ దసరా వేడుకలు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది