ATA Dussehra Celebrations: చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి
దేశ, విదేశాల్లో దసరా సంబరాలు జరుపుకోవడం ఆనందం
మన సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత
ఖండాంతరాలు దాటినా.. కనీవినీ ఎరుగని రీతిలో దసరా సంబరాలు నిర్వహించడం సంతోషం
న్యూజెర్సీలో ‘ఆట’ దసరా ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
వరంగల్, స్వేచ్ఛ: చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. అమెరికా తెలుగు సంఘం అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన దసరా వేడుకలలో (ATA Dussehra Celebrations) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎన్నారైలు, బలగం మూవీ బెస్ట్ లిరిక్స్ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్, ఫోక్ సింగర్స్ రేలారే గంగా, దాండియా శ్రీను, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూంధాం, జానపద గేయాలు, సినిమా పాటలతో అంగరంగ వైభవంగా దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.
Read Also- Kadiyam Kavya: బీఆర్ఎస్ పార్టీకి బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదు.. కడియం కావ్య కీలక వ్యాఖ్యలు
ఆట దసరా వేడుకల సందర్భంగా ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులతో దసరా సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు కుటుంబ సభ్యులతో పాల్గొని షమీ పూజతో పాటు ఆటపాటలతో సందడి చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఖండంతరాలు దాటి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయాన్ని కుటుంబాలు, స్నేహితులు, కలిసి సంబరాలు చేసుకోవడం గొప్ప విషయమని సుందర్ రాజ్ యాదవ్ కొనియాడారు. రామలీలా ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, తెలుగువారి ఐక్యతతో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విదేశాలలో ఉంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆకాంక్షించారు.
Read Also- Medicine Nobel 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఏం సాధించారో తెలుసా?
