Navi Mumbai Airport: తొలి డిజిటల్ ఎయిర్ పోర్ట్.. ప్రత్యేకతలు ఇవే!
Navi Mumbai Airport (Image Source: twitter)
జాతీయం

Navi Mumbai Airport: దేశంలో తొలి డిజిటల్ ఎయిర్ పోర్ట్.. నిర్మాణానికి రూ.19,650 కోట్లు ఖర్చు.. ప్రత్యేకతలు ఇవే!

Navi Mumbai Airport: దేశంలో మరో అత్యంత సుందరమైన విమానశ్రయం అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర ముంబయిలోని నవి ముంబై ఎయిర్ పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఎయిర్ పోర్టును ప్రధాని పరిశీలించారు. అదానీ గ్రూప్, సీఐడీసీవో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మించారు. దీని నిర్మాణానికి ఏకంగా రూ. 19,650 కోట్లను ఖర్చు చేయడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ జాహా హదీద్ (Zaha Hadid Architects) ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కావాల్సిన డిజైన్ ను అందించడం గమనార్హం.

కమలం ఆకృతిలో..

సరికొత్త నవీ ముంబై ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పరిశీలిస్తే.. లోపలి పిల్లర్లు కమలం ఆకారంలో కనిపిస్తాయి. ఉక్కు, గాజుతో నిర్మించిన ఎయిర్ పోర్ట్ పిల్లర్లు.. కమలం పువ్వు రేకుల ఆకారంలో దర్శనమిస్తాయి. ఈ ఎయిర్ పోర్ట్ మెుత్తం 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో రూపొందింది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ ఎయిర్ పోర్ట్.. విమాన రాకపోకలకు అందుబాటులోకి రానుంది. అయితే పలు దశల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. మెుదటి దశలో 3,700 మీటర్ల రన్‌వే తో పాటు ఏడాదికి సుమారు 2 కోట్ల ప్రయాణికులను ఈ ఎయిర్ పోర్ట్ సేవలు అందించనుంది. భవిష్యత్తులో 9 ప్రయాణికుల వరకూ దీని సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇందుకోసం రెండు సమాంతర రన్ వేలు, మరికొన్ని టెర్మినల్స్ ను నిర్మిస్తారు.

డిజిటల్ విమానాశ్రయం

నవీ ముంబై ఎయిర్ పోర్టు పూర్తిస్థాయిలో డిజిటల్ సేవలు అందించనుంది. ఆన్‌లైన్ బ్యాగేజ్ డ్రాప్, ప్రీ-బుక్ పార్కింగ్ స్లాట్లు, AI-ఆధారిత టెర్మినల్ ఆపరేషన్లను నిర్వహించనుంది. అలాగే డిజిటల్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్లు, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ప్రయాణికులకు మంచి అనుభూతిని, సౌకర్యాన్ని కలిగించనున్నాయి. అలాగే అధునాతన ల్యాండింగ్ సిస్టమ్ కూడా ఈ ఎయిర్ పోర్టుకు మరో ఆకర్షణగా నిలవనుంది. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలోనూ విమానాలు సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా ఇక్కడి సాంకేతిక వ్యవస్థ దోహం చేయనుంది.

ట్రోన్స్ పోర్ట్ కనెక్టివిటీ..

విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు ఈ ఎయిర్ పోర్ట్ దోహదం చేస్తుంది. ఇందుకోసం ముంబై ట్రాన్స్ హార్బర్, మెట్రో లైన్ 1, మెట్రో లైన్ 8తో విమానాశ్రయాన్ని కనెక్ట్ చేశారు. దేశంలోనే వాటర్ ట్యాక్సీ కనెక్షన్ తో రూపొందిన మెుట్టమెుదటి విమానశ్రయం ఇదే కావడం విశేషం.

Also Read: Post Office Scheem: రోజుకు రూ.2 పెట్టుబడితో.. రూ.10 లక్షలు పొందే.. అద్భుతమైన పోస్టాఫీసు స్కీమ్!

ప్రయాణికుల సౌకర్యాలు

నవీ ముంబై ఎయిర్ పోర్టు పూర్తిగా ఆటోమేటెడ్ కార్గో టెర్మినల్ తో రూపొంది. డిజిటల్ ట్రాకింగ్, పేపర్ లెస్ / క్యాష్ లెస్ చెల్లింపులు, మెడికల్ సౌకర్యం కూడా ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉంది. అలాగే 66 చెక్ ఇన్ కౌంటర్లు, 29 ఏరో బ్రిడ్జెస్, 22 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు, 10 బస్ బోర్డింగ్ గేట్లు, ఫుడ్ క్యాంటిన్స్, ప్రీ ఆర్డర్ మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్, వీల్ చైర్స్ కూడా ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: Simhachalam: సింహాచలం ఆలయంలో చేతివాటం.. బంగారు ఆభరణాలు కొట్టేసిన ఉద్యోగులు!

Just In

01

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు