Post Office Scheem: మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇవాళ ఎంతో సంతోషంగా కనిపించిన వ్యక్తి మరునాడు గుండెపోటుతో మరణించిన సందర్భాలు నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల కారణంగానూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసం పోస్టాఫీసులో ఒక అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల విలువైన ప్రమాద బీమాను పొందవచ్చు.
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం
అకస్మిక ప్రమాదల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్టాఫీసు.. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (Group Accident Insurance Scheme – GAIS) ను తీసుకొచ్చింది. ఈ పథకం రెండు వేరియంటల్లో అందుబాటులో ఉంది. ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. మీకు రూ.5 లక్షల బీమా లభిస్తుంది. అలా కాకుండా రూ.557 చెల్లించినట్లయితే ఏడాదికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ పొందవచ్చు.
100 శాతం కవరేజీ..
ఈ స్కీమ్ ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను బట్టి పరిహారాన్ని అందిస్తుంది. ప్రమాదం వల్ల మరణం సంభవిస్తే 100 శాతం బీమా డబ్బును బాధిత కుటుంబానికి పోస్టాఫీసు అందజేస్తుంది. ఒకవేళ ప్రమాదంలో శాశ్వత వైకల్యం సంభవించినా కూడా పూర్తి ఇన్సూరెన్స్ ను బాధితులకు అందజేస్తారు. ప్రమాదం కారణంగా అయిన వైద్య ఖర్చులను ఈ స్కీమ్ రికవరీ చేస్తుంది.
క్లెయిమ్ ప్రక్రియ (Claim Process)
అయితే ప్రమాదం జరిగిన 30 రోజుల లోపు బీమా కోసం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ, డెత్ సర్టిఫికెట్/మెడికల్ రిపోర్ట్స్/హాస్పిటల్ బిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాలసీ కాపీ సమీపంలోని పోస్టాఫీసు వాళ్లకు సమర్పించాల్సి ఉంటుంది. వారు ప్రమాదాన్ని నిర్ధారించుకున్న తర్వాత మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తారు.
Also Read: Simhachalam: సింహాచలం ఆలయంలో చేతివాటం.. బంగారు ఆభరణాలు కొట్టేసిన ఉద్యోగులు!
వీటికి బీమా వర్తించదు
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా చనిపోతే ఎలాంటి బీమా అమౌంట్ రాదు. అలాగే ఆత్మహత్య, అడ్వెంచర్, క్రైమ్, సహజ మరణం వంటి విషయాల్లో ఈ బీమా వర్తించదు.
