IND vs WI First Test: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ కరీబియన్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఫలితంగా వెస్టిండీస్ 23.2 ఓవర్లకే 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ 90-5 (23.2 Ov) పరుగుల వద్ద క్రీజులో ఉంది. లంచ్ బ్రేక్ కావడంతో ఆటకు కొద్దిసేపు విరామం ఇచ్చారు. కాసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.
టాస్ గెలిచి.. కష్టాల్లోకి
వెస్టిండీస్ – టీమిండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్.. ప్రస్తుతం గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్డేడియంలో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు.. తమ అంచనాలను అందుకోలేకపోయింది. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ ను కెప్టెన్ రోస్టన్ చేస్ (22*), షాయ్ హోప్ (26) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వారిద్దరు క్రీజులు కుదురుకుంటున్న దశలో బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్.. తన అద్భుతమైన స్పెల్ తో షాయ్ హోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 23.2 ఓవర్లకే వెస్టిండీస్ 5 వికెట్లను కోల్పోయింది. మరోవైపు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ తో పాటు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత వెస్టిండీస్ మరిన్ని వికెట్లను కోల్పోయే ఛాన్స్ ఉంది.
Also Read: Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!
తుది జట్లు ఇలా..
టీమిండియా: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కులదీప్ యాదవ్
వెస్టిండీస్: రోస్టన్ చేజ్ (కెప్టెన్), త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అథనేజ్, బ్రెండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జొమెల్ వారికన్, ఖేరీ పియెరీ, జాన్ లైన్, జైడెన్ సీల్స్