Airtel Recharge Plan (Image Source: Twitter)
బిజినెస్

Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!

Airtel Recharge Plan: దేశంలో అత్యధిక మంది యూజర్లు ఉన్న టెలికాం రంగ సంస్థల్లో భారతి ఎయిర్ టెల్ ఒకటి. ఎయిర్ టెల్.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తరుచూ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రకటిస్తూ ఉంటుంది. అందులో కొన్ని విశేష ఆధరణ సంపాదిస్తే.. మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. అయితే ఎయిర్ టెల్ తీసుకొచ్చిన రూ.199 రీఛార్జ్ ప్లాన్ మాత్రం స్థిరంగా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ ను పెద్ద ఎత్తున చాలా మంది రీచార్జ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్లాన్ స్పెషల్ ఏంటీ? దానివల్ల యూజర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు? ఇప్పుడు చూద్దాం.

రూ.199 రిఛార్జ్ ప్లాన్ గురించి..

డిజిటల్ యుగంలో నానాటికి పెరిగిపోతున్న మెుబైల్ రీఛార్జ్ ప్లాన్స్ మధ్య ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోన రూ.199 ప్లాన్ మాత్రం మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా.. రోజుకి అన్ లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ 5G ఇంటర్నెట్ (3 జీబీ డేటా), 100 SMSలు వంటి సదుపాయాలు అందిస్తోంది. 5జీ డేటా వస్తున్నందున నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలను ఎలాంటి అంతరాయం లేకుండానే స్ట్రీమింగ్ చేయవచ్చు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఎలా రిఛార్జ్ చేసుకోవాలి?

రూ.199 ప్లాన్ పొందాలనుకునేవారు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రిఛార్జ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ పేమెంట్ సౌకర్యం ఉంది. పేటీయం (Paytm), ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay), అమెజాన్ పే (Amazon Pay) ద్వారా కూడా నగదును చెల్లించవచ్చు. ఒకవేళ ఆఫ్ లైన్ లో రీఛార్జ్ చేసుకోవాలని భావించే వారు.. ఎయిర్ స్టోర్ లేదా మెుబైల్ షాపులను సంప్రదించవచ్చు.

Also Read: Ramreddy Damodar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎవరికి బెస్ట్ ప్లాన్?

ఎయిర్ టెల్ రూ.199 ప్లాన్.. విద్యార్థులు, ఆఫీస్ కు వెళ్లేవారు, చిన్న వ్యాపారులు, రోజూ సోషల్ మీడియా వినియోగించేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. మెయిల్స్ పంపేవాళ్లు, తరుచూ ఫోన్స్ లో మాట్లాడేవారు, ఎస్ఎంఎస్ లు పంపేవారికి ఇది సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

Also Read: Hyderabad: పండక్కి గోరింటాకు పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే పక్కా షాకవుతారు.. పెద్ద స్కామే ఇది!

Just In

01

Shocking News: అత్తను జుట్టు పట్టుకొని కొట్టిన కోడలు.. వద్దని వేడుకున్న మనవడు.. వీడియో వైరల్

Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు.. వారి కాంబోలో ఇది రెండో చిత్రం

Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

MLA Kaushik Reddy: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయం: కౌశిక్ రెడ్డి

Pawan Kalyan weakness: తన వీక్‌నెస్ ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్.. అందుకేనా..